
దక్షిణ భారతదేశం అంతటా ఎన్నో అందమైన హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడికి నిరంతరం నటీనటులు, క్రికేటర్స్, ఇలా చాలా మంది సెలబ్రిటీస్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అందులో ముఖ్యమైన ప్రదేశం ఊటీ. ఊటీ అందాలు వర్ణించడం కష్టమే. ఇక్కడి కాఫీ తోటలు, అందమైన వంతెనెలు, ఎత్తైన కొండలు, జలపాతాలు, కొండల్లో రైలు ప్రయాణం ఇవన్నీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆలియా భట్, జాన్వీకపూర్, పూజా భట్ ఫేవరెట్ ప్లేసెస్ ఇవి. వారు ఏ కాస్త సమయం దొరికినా సరే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. చాలా సార్లు వీరు ఇక్కడి ఫొటోస్ తమ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే కాకుండా ఇక్కడ చాలా సినిమాల షూటింగ్ కూడా జరిగింది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు ఊటీలోని లవ్ డేల్ ప్రాంతంలో హైడ్ అవే అనే పేరుతో ఓ ప్రైవేట్ విల్లా ఉంది. తాను ఊటి వచ్చి అక్కడ భస చేసి, ఆనందంగా గడిపేవాడంట.

కూనూర్ : ఊటీకి కాస్త దూరంలో ఉండే కూనూర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ జనసందోహం, అందమైన కొండలు, ఆకాశాన్ని అందుకున్నాయా అనేలా మేఘాలను తాకిన హిల్ స్టేషన్స్ చూస్తూ ఆనందంగా గడపాలి అని ఎవరు అనుకోరు. చాలా మంది ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక ఇక్కడ కంగనా రనౌత్ నటించిన సినిమాల షూటింగ్ కూడా జరిగింది. చాలా మంది ముద్దుగుమ్మలు ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.

మున్నార్ : ప్రకృతి అందం అంతా ఇక్కడే ఉందా అనేలా ఉంటుంది మున్నార్. ఇక్కడి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలవు. కేరళలో ఉన్న అందమైన ప్రదేశాల్లో ఇదొక్కటి. పశ్చిమకనుమలలోని అందాలు, ఆకాశాన్నంటే హిల్ స్టేషన్స్, టీ తోటలు, జలపాతాలు, మున్నార్ కొడైకెనాల్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా మంది సెలబ్రీటీలు ఇక్కడికి వెళ్లి చూసి రావడం కంటే అక్కడే బస చేయడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. పారక్కట్ నేచర్ మోటల్, రిసార్ట్స్ వంటి వాటిల్లో బస చేసి మున్నార్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా దీపికా పదుకొనే, జాన్వీకపూర్ వంటి వారు ఇక్కడికి ఎక్కువగా వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.

కూర్గ్ :బెంగళూరుకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఎక్కువగా కూర్గ్ వెళ్లి అక్కడ బస చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇది ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ జనసందోహం చాలా తక్కువగా ఉండటమే కాకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రకృతి ఒడిలో ఏకాంతంగా గడపడానికి ఏ కాస్త సమయం దొరికినా సరే అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఎక్కువగా ఇక్కడికే వస్తారంట. అంతే కాకుండా చాలా మంది సెలబ్రిటీల ఫేవరెట్ ప్లేస్ కూర్గ్.

వయనాడ్ : కేరళలో ఉన్న అందమైన ప్రదేశాల్లో వయనాడ్ కూడా ఒకటి. పృథ్వీ రాజ్ సుకుమారన్, ఫహద్ ఫాసిల్ వంటి మలయాళం సినీ తారలు ఎక్కువగా వయనాడ్ వెళ్లి అక్కడ ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. అందమైన హిల్ స్టేషన్స్, కేఫ్‌లు, ఫారెస్ట్ స్టేలు ఇవన్నీ మానసిక ఆనందాన్ని మెరుగు పరుస్తాయి.