
శెనగపప్పు వడలకు కావాల్సిన పదార్ధాలు: ఒక కప్పు శెనగపప్పు , పావు కప్పు బియ్యపు పిండి, మీడియం సైజ్ ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి, రెండు బంగాళాదుంప, నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఇంకా కొద్దిగా కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర ఆకులు, అర టీ స్పూన్ జీలకర్ర, రెండు టీ స్పూ పిండి, రుచికి తగినంత ఉప్పు, ఇంకా వడలు ఎర్రగా కాల్చడానికి సరిపడా ఆయిల్ ను తీసుకోవాలి.

శెనగపప్పు వడల తయారి విధానం : మీరు ముందుగా ఒక కప్పు శెనగపప్పును తీసుకుని వాటిని బాగా నానబెట్టుకుని తీసుకోవాలి. ఇంకా వీటిని తీసుకుని రోటిలో రుబ్బుకోవాలి మరి పేస్ట్ గా కాకుండా కచ్చా పచ్చగా రుబ్బితే సరిపోతోంది. ఆ తర్వాత దీనిలో ఐదు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకోవాలి.

శెనగపప్పు వడల తయారి విధానం స్టెప్ 2: ఇంకా ఈ మిశ్రమంలో ఉడికించిన దుంపలు, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మిక్స్ అయ్యేలా చేతితో బాగా కలపాలి. ఇంకా దీనిలో టేస్టింగ్ సాల్ట్ కూడా కలుపుకోవాలి. అప్పుడే వీటి రుచి పెరుగుతుంది. ఇంకా దీనిలో ఉడికించిన దుంపలను పేస్ట్ కూడా చేసుకుని దీనిలో కలపాలి. అప్పుడే ఈ వడలు తినడానికి మంచిగా ఉంటాయి.

శెనగపప్పు వడల తయారి విధానం స్టెప్ 3 : ఈ పిండి శెనగపప్పుది కాబట్టి దీనిని చక్కగా కలపడం వల్ల ఈ సెనగప్పులకు అన్ని ఫ్లేవర్లు కూడా చక్కగా అందుతాయి. ఇక ఇప్పుడు దీనిలో తయారు చేసుకున్న మిశ్రమంతో చిన్న చిన్న వడలుగా చేసుకుని ఒక వైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా వీటిని బాగా కాల్చుకోవాలి.

ఈ వడలను ఎర్రగా కాల్చుకోవడం కోసం గ్యాస్ పొయ్యి మీద పాన్ పెట్టి దానిలో నూనెలో వేసుకోవాలి అది కొద్దిగా వేడయ్యాక చేతితో పిండి తీసుకుని వడలుగా వేసుకోవాలి. అయితే వీటిని మీరు మీడియం మంట మీదే బాగా కాల్చుకోవాలి . ఇవి రంగు మారిన తర్వాత ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుని తినడమే. అంతే అంతే వేడి శెనగపప్పు వడలు రెడీ