
శాస్త్రీయ రహస్యం: మనిషి ఆయుష్షును నిర్ణయించే కీలక అంశం మన కణ కేంద్రకంలోని 23 జతల క్రోమోజోమ్‌లలో దాగి ఉంది. ఈ క్రోమోజోమ్‌ల చివరి భాగంలో ఉండే రక్షణ కవచాల వంటి నిర్మాణాలను టిలోమియర్లు అంటారు. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. ఈ టిలోమియర్ల పొడవు ఎంత ఎక్కువగా ఉంటే మనిషి ఆయుష్షు అంత ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ లేదా తప్పుడు జీవనశైలి వల్ల ఈ టిలోమియర్లు క్షీణిస్తూ ఉంటే ఆయుష్షు కూడా తగ్గిపోతుంది. మన ప్రాచీన రుషులు తమ జీవనశైలి ద్వారా ఈ టిలోమియర్ల పొడవు తగ్గకుండా రక్షించుకోగలిగారు.

ఆహార నియమం: రుషులు ప్రకృతి సిద్ధమైన విత్తనాలు, పండ్లు, కాయలను మాత్రమే స్వీకరించేవారు. రోజులో కేవలం 8 గంటల వ్యవధిలోనే ఆహారం తీసుకోవాలి. మిగిలిన 16 గంటలు ఉపవాసం ఉండటం వల్ల కణాలు తమను తాము శుద్ధి చేసుకుంటాయి. తీసుకునే ఆహారంలో 70శాతం జ్యూస్‌లు, సలాడ్‌లు, మొలకెత్తిన విత్తనాలు ఉండాలి. వండిన ఆహారాన్ని 30 శాతానికి పరిమితం చేయడం వల్ల టిలోమియర్ల పొడవు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

యోగ - ప్రాణాయామం: ప్రాణాయామం అంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, అది కణాల పునరుజ్జీవనం. ప్రతిరోజూ 20 నిమిషాల ప్రాణాయామం, ఒక గంట యోగా అభ్యసించడం వల్ల క్రోమోజోమ్‌ల చివర ఉండే టిలోమియర్లు దెబ్బతినకుండా రక్షించబడతాయి. ఇది కణ స్థాయిలో వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది.

ధ్యానం: ఒత్తిడి అనేది టిలోమియర్లకు అతిపెద్ద శత్రువు. ప్రతిరోజూ ధ్యానం చేయడం వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి, టిలోమియర్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉదయం అరగంట, పడుకునే ముందు 10 నిమిషాల ధ్యానం దీర్ఘాయుష్షుకు పునాది వేస్తుంది.

నిండు నూరేళ్లూ మన చేతుల్లోనే: పెద్దల దీవెనలు నిజం కావాలంటే, కేవలం ఆశీర్వాదం ఉంటే సరిపోదు.. ఆచరణ కూడా ఉండాలి. రుషులు అందించిన ఈ విజ్ఞానాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే వారు కేవలం వంద ఏళ్లు మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ కాలం సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలరు. మన కణాల రూపకల్పనే 150 ఏళ్ల కోసం జరిగినప్పుడు, అకాల మరణం పాలవ్వడం మన జీవనశైలి వైఫల్యమే తప్ప శరీరానిది కాదు.