చాలా మంది పెన్సిల్‌ను కొనుగోలు చేసేటప్పుడు HB, 2B పెన్సిల్‌లు ఇవ్వండి అని కిరాణా షాపు వారిని అడుగుతుంటారు. పెన్సిల్‌పై HB, 2B 2H, 9H వంటి కోడ్‌లు ఉంటాయి. మరి ఈ కోడ్‌లకు అర్థం ఏంటో తెలుసా?
చాలా మంది పెన్సిల్‌ను కొనుగోలు చేసేటప్పుడు HB, 2B పెన్సిల్‌లు ఇవ్వండి అని కిరాణా షాపు వారిని అడుగుతుంటారు. మరి ఆ కోడ్‌లతో ఎందుకు అడుగుతారని ఎప్పుడైనా ఆలోచించారా? పెన్సిల్‌పై ఉండే HB, 2B 2H, 9H వంటి కోడ్‌ల ప్రకారం దాని ప్రియారిటీ మారుతుందని తెలుసా? ఈ కోడ్‌లు పెన్సిల్ నాణ్యతకు సంబంధించినవి అని తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం.
పెన్సిల్ చివర HB అని రాసి ఉంటుంది. H అంటే హార్డ్ అని అర్థం, B అంటే (బ్లాక్) నలుపు అని అర్థం. అంటే, HB ఉన్న పెన్సిల్ సాధారణ ముదురు రంగులో ఉంటుంది. అదేవిధంగా, పెన్సిల్‌పై HH అని రాసి ఉంటే.. అది మరింత స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదేవిధంగా.. 2B, 4B, 6B, 8B ఉన్న పెన్సిల్స్ మరింత తిక్‌గా వ్రాస్తుంది.
ఈ కోడింగ్ ఆధారంగా పెన్సిల్‌లో నలుపు రంగులో కనిపించే గ్రాఫైట్ ప్రభావం ఉంటుంది. కోడ్‌ని బట్టి దాని తిక్‌నెస్ పెరుగుతుంది. దీనిని 2B, 4B, 6B, 8B తో సూచిస్తారు. అంటే, 2B కంటే 8B ముదురు నలుపు రంగులో ఉంటుందన్నమాట.
అది ఆఫీసు అయినా, పాఠశాల అయినా సాధారణంగా HB పెన్సిల్‌ను ఉపయోగించమని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే దాని లోపల ఉన్న గ్రాఫైట్ క్లియర్‌గా రాస్తుంది. HB కోడ్ తో ఉన్న పెన్సిల్ సగటు రంగును ఇస్తుంది. అందుకే దీనిని ఉత్తమంగా పేర్కొంటారు.