పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రైస్.. ఇది పెడితే బాక్స్ ఖాళీనే

Updated on: Sep 21, 2026 | 4:39 PM

పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం. ప్రతి రోజూ వైట్ రైస్, కర్రీస్ పెట్టడం కంటే, ఒకసారి ఇలా క్యారెట్ రైస్ చేసి వండి పెట్టండి చాలు. పిల్లలు బాక్స్ ఖాళీ చేయడమే కాకుండా, కడుపు నిండుగా తింటారు. మరి దీనిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి.

1 / 5
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి రెండు టేబుల్‌స్పూన్ల నూనె తీసుకోండి. కావాలంటే ఒక టేబుల్‌స్పూన్ నూనె, మరో టేబుల్‌స్పూన్ నెయ్యి కూడా ఉపయోగించవచ్చు. ఒక కప్పు మధ్యస్థంగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలను వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అర కప్పు క్యారెట్ ముక్కలు కలిపి, కొద్దిగా ఉప్పు వేసి, మూత పెట్టి మీడియం మంటపై మూడు నిమిషాలు  వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.

2 / 5
తర్వాత అదే పాన్‌లో నెయ్యి వేసి, బిర్యానీ ఆకులు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి బాగా దోరగా వేయించుకోవాలి.  తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చీ, అల్లం వెల్లులి పేస్ట్, జీడి ప్పులు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం పాటు వేయించాలి.

3 / 5
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఆలూ, క్యారెట్ ముక్కలను ఇందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి.

4 / 5
మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత, ఒక గ్లాస్  ఉడికించిన సాధారణ బియ్యం  వేయాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర ఆకు, రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపి, అన్నం బాగా వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్‌లో బాగా కలపాలి. అన్నం కలిపిన తర్వాత, మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి, మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించండి.

5 / 5
బాగా ఉడికి మంచి సువాసన వస్తుంది. ఇలా ఉడికించుకోవడం వలన  మసాలాలు, ఉప్పు, కారం అన్నానికి బాగా పడతాయి. ఒక నిమిషం తర్వాత మూత తీసి మరోసారి కలిపి, కొంచెం కొత్తిమీరను వేయండి. అంతే ఎంతో  ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ ఆలూ క్యారెట్ ఫ్రైడ్ రైస్ సిద్ధం. పిల్లలకు ఇలా వండి పెడితే చాలా ఇష్టంగా తింటారు.

Loading...
Unable to load recommendations.
Follow Us