Saffron During Pregnancy: ప్రెగ్నెన్సీ టైమ్‌లో కుంకుమ పువ్వు పాలు తీసుకుంటున్నారా..? అయితే జాగ్రత్త..!

Updated on: Oct 01, 2026 | 11:36 AM

గర్భధారణ కాలంలో మహిళల ఆహార అలవాట్లు కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో పెద్దలు, వైద్యులు పాలు తాగమని సలహా ఇస్తుంటారు. అందులోనూ కొద్దిగా కుంకుమపువ్వు కలిపి తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మూడ్ స్వింగ్స్, కోపం, ఆందోళన రావడం సహజం. కుంకుమపువ్వులోని సిరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచే గుణాలు మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తాయి. గర్భధారణ సమయంలో రక్తపోటు పెరగడం తల్లికి, బిడ్డకు ప్రమాదకరం. కుంకుమపువ్వులో ఉండే పొటాషియం, ఆంటియాక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి దోహదపడతాయి.

2 / 5
గర్భిణీలలో గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కుంకుమపువ్వు పాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై, ఉదయాన్నే వచ్చే వికారం మరియు వాంతుల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

3 / 5
గర్భం దాల్చిన తర్వాత పొత్తికడుపు పెరగడం, శరీర నొప్పుల వల్ల నిద్రలేమి సమస్య వేధిస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కుంకుమపువ్వు పాలు తాగితే నరాలు శాంతించి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. కుంకుమపువ్వు శరీరాన్ని వెచ్చగా ఉంచి, రక్తప్రసరణను పెంచుతుంది. దీనివల్ల కడుపులోని పాప కదలికలు మరింత చురుగ్గా మారతాయని నమ్ముతారు.

4 / 5
ఎప్పుడు ప్రారంభించాలి?: గర్భం దాల్చిన మొదటి 3 నెలలు కుంకుమపువ్వు తీసుకోకూడదు. సాధారణంగా 5వ నెల నుండి ప్రారంభించడం సురక్షితం. ఒక గ్లాసు పాలలో కేవలం 2 నుండి 3 రెబ్బలు మాత్రమే వేసుకోవాలి. కుంకుమపువ్వు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి పెరిగి, గర్భాశయ సంకోచాలకు దారితీసే ప్రమాదం ఉంది.

5 / 5
కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల పుట్టే పిల్లలు తెల్లగా పుడతారనేది ఒక అపోహ మాత్రమే. కానీ, ఆరోగ్యపరంగా ఇది తల్లికి, పుట్టబోయే బిడ్డకు అద్భుతమైన పోషకాలను అందిస్తుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో దీనిని తీసుకుని ఆరోగ్యకరమైన గర్భధారణను కొనసాగించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us