Rice Cleanser For Skin: ముఖంపై నల్లని ట్యాన్‌ వదలాలా?.. బియ్యం, నిమ్మకాయతో ఇలా చేసి చూడండి!

Updated on: Feb 22, 2024 | 11:45 AM

ముఖం కాంతివంతంగా ఉండాలని ఎవరు కోరుకోరు! చాలా మంది అందాన్ని మరింత మెరిపించడానికి రకరకాల కాస్మోటిక్స్ వాడుతుంటారు. కానీ, రూపాయి ఖర్చుకాకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో స్వంత క్లెన్సర్‌ను తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మ కాంతి మరింత పెరుగుతుంది. ఒక గిన్నెలో కొన్ని బియ్యాన్ని తీసుకోవాలి. తర్వాత నిమ్మకాయ తీసుకుని దానిని సగం కోసి కొన్ని చుక్కల రసాన్ని కలపాలి. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా..

1 / 5
ముఖం కాంతివంతంగా ఉండాలని ఎవరు కోరుకోరు! చాలా మంది అందాన్ని మరింత మెరిపించడానికి రకరకాల కాస్మోటిక్స్ వాడుతుంటారు. కానీ, రూపాయి ఖర్చుకాకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో స్వంత క్లెన్సర్‌ను తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మ కాంతి మరింత పెరుగుతుంది. దీనిని ఎలా తయారు చేయాలంటే..

2 / 5
ఒక గిన్నెలో కొన్ని బియ్యాన్ని తీసుకోవాలి. తర్వాత నిమ్మకాయ తీసుకుని దానిని సగం కోసి కొన్ని చుక్కల రసాన్ని కలపాలి. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే నిమ్మరసం క్లెన్సర్ల తయారీలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

3 / 5
నిమ్మరసం కలిపిన బియ్యంను నీళ్లతోపాటు నానబెట్టాలి. బియ్యం, నిమ్మకాయ రసం మిశ్రమాన్ని నీళ్లతో కాసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. గిన్నెలో పై తొక్కతో నిమ్మకాయలను ఉంచాలి. కొంత సమయం తరువాత బియ్యం నీటిని వడకట్టాలి. నిమ్మ తొక్క చర్మంపై నల్ల మచ్చలను తొలగించడంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి చేతులు, కాళ్ళపై నిమ్మ తొక్కను రుద్దవచ్చు. నిమ్మతొక్క చర్మంలోని నల్లటి మచ్చలను తొలగించి, తిరిగి కాంతిని తీసుకురావడానికి సహాయపడుతుంది.

4 / 5
బియ్యం, నిమ్మకాయ రసం నానబెట్టిన నీటిని సీసాలో పోసి కొన్ని గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇది బాగా చల్లబడితే క్లెన్సర్ రెడీ అయినట్లే. ఇప్పుడు ఆ క్లెన్సర్‌లో కాటన్ బాల్‌ను ముంచి ముఖానికి రోజూ అప్లై చేసి, ఆరిపోయిన తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా క్రమంగా రాత్రి పడుకునే ముందు క్లెన్సర్‌తో మీ ముఖాన్ని శుభ్రం చేయడం వల్ల నల్లని ట్యాన్‌ తొలగిపోయి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

5 / 5
ముఖాన్ని క్లెన్సర్‌తో కడిగిన తర్వాత, తప్పనిసరిగా ముఖానికి మాయిశ్చరైజర్ క్రీమ్‌ను అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. కానీ గుర్తుంచుకోండి.. బియ్యంతో చేసిన క్లెన్సర్‌ను 7 రోజుల వరకు మాత్రమే ఉపయోగించాలి. 7 రోజుల తర్వాత మళ్లీ తయారుచేసుకోవాలి.