అరటి ఎగుమతులపై తుఫాన్ ఎఫెక్ట్.. రైతుల కంట కన్నీరు

Edited By:

Updated on: Sep 26, 2026 | 2:09 PM

గత కొన్ని రోజుల క్రితం వరకు వరుస పండుగలతో గిట్టు బాటు ధర లభించి ఎగుమతులు ఊపందుకుని ఉత్సాహంలో ఉన్న అరటి రైతులు నేడు తుఫాను ప్రభావం కారణంగా సరుకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు కాక కొన్ని రోజులుగా నిరుత్సాహాన్ని ఎదుర్కొంటున్నారు.

1 / 5
గత కొన్ని రోజుల క్రితం వరకు వరుస పండుగలతో గిట్టుబాటు ధర లభించి ఎగుమతులు ఊపందుకుని ఉత్సాహంలో ఉన్న అరటి రైతులు నేడు తుఫాను ప్రభావం కారణంగా సరుకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు కాక కొన్ని రోజులుగా నిరుత్సాహాన్ని ఎదుర్కొంటున్నారు. తుఫాన్ కారణంగా అరటి తోటలో అక్కడక్కడ అరటి చెట్లు ఒరిగిపోవడం, చెట్టుకు కాసిన అరటి గెల బరువును తట్టుకునేలా సపోర్టుగా వేసిన కర్రలు విరిగిపోవడం వంటి కారణాలతో అరటి రైతులు నష్టాలను సవిచూస్తున్నారు.

2 / 5
ఈ పరిస్థితుల్లో నాసిరకంగానే ఉండగా గెలలను కోయాల్సి రావడం, మరోవైపు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు సన్నగిల్లడంతో అరటి రైతులు ఆర్థిక ఒడిదుడుకులతో అల్లాడుతున్నారు. ఓవైపు వాతావరణం చల్లబడి అరటి వినియోగం తగ్గడం,మరోవైపు పండుగల సీజన్ కూడా ముగియడంతో  అరటికి అనూహ్య రీతిలో డిమాండ్ తగ్గింది. దీనికి తోడు తుఫాను ప్రభావం కూడా అరటి రైతులపై పడటంతో  రైతుల్లో నిరుత్సాహం నెలకొంది.

3 / 5
దీంతో జాతీయ స్థాయిలో పేరుగాంచిన రావులపాలెంలోని అరటి మార్కెట్లో ఎగుమతులు తగ్గి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. రావులపాలెం అరటి మార్కెట్ కు జాతీయస్థాయిలో పేరు ఉంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం, అయినవిల్లి, పి.గన్నవరం, పెరవలి, సిద్ధాంతం, ఖండవిల్లి, కడియం, కొవ్వూరు, దొమ్మేరు, తదితర ప్రాంతాల్లో దాదాపు 30 వేల ఎకరాల్లో పండే అరటి ఎగుమతికి రావులపాలెం మార్కెట్ యార్డ్ ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది.

4 / 5
 ఈ యార్డ్ నుంచి నిత్యం 15 వేల నుంచి 20 వేలు పైబడి అరటి గెలలు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని ముఖ్య పట్టణాలతోపాటు ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి. అయితే తుఫాను ప్రభావంతో రావులపాలెం మార్కెట్ యార్డ్ కు ఇతర ప్రాంతాల నుంచి పెద్దగా కొనుగోలు దారులు, ఇతర ప్రాంతాలకు సరుకు పంపించే  వర్తకులు రాకపోవడంతో మొన్నటి వరకు ఒక లోడ్ (ఆరు గెలలు) కర్పూర రకం రూ.2500 నుంచి రూ. 3000 పలుకగా నేడు అదే లోడు 1000 నుంచి 1500 వరకూ, రూ.3000 నుంచి రూ.3500 వరకూ ఉన్న చక్రకెళ్లి  రూ. 1200 నుంచి రూ. 1500 వరకు మాత్రమే ధర పలుకుతుంది. అలాగే రూ. 3000 ల వరకు పలికిన  అమృతపాణి  రూ. 2000 దాటి పలకకపోవడంతో రైతులు నష్టాలు వస్తున్నాయి అంటూ ఆవేదన చెందుతున్నారు.

5 / 5
అరటి ఎగుమతులు తగ్గడంతో రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో ఉపాధి కూడా కొంచెం మెర తగ్గింది. ఇక్కడ కొన్న గెలలను ఇతర ప్రాంతాలకు తరలించాలంటే అరటి గెలలకు చెత్త చుట్టి ఎగుమతి చేస్తారు. ఈ చెత్త చుట్టుపై అనేకమంది, అలాగే చెత్త చుట్టడానికి ఉపయోగించే అరటి ఆకులు సరఫరాదారులుగా కొంతమంది ఉపాధి పొందుతుండగా వారికి కూడా కొంచెం పని తగ్గింది. తుఫాను ప్రభావం కారణంగా నష్టపోయిన తమని ఆదుకోవాలని అరటి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us