
ఏదైనా పండుగ వస్తే చాలు అందరి ఇళ్లలో ఏదొక తీపి వంటకం చేస్తారు. వాటిలో ఈ అప్పాలు కూడా ఒకటి. చిన్న చిన్న ఊర్లలో ఈ రెసిపీ ఫేమస్. ఎందుకంటే, ఇది ఆరోగ్యానికిచేసే మేలు అంతా ఇంతా కాదు. అలాగే, వీటిని తింటే రోగ నిరోధక శక్తి కూడా కూడా పెరుగుతుంది. అయితే, దీనిని ఎక్కువగా ప్రత్యేక సమయాల్లో మాత్రమే తింటారు. ఇంకా దీనిని మీ పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు

రాగి పిండి అప్పాలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు : మూడు కప్పుల రాగి పిండి ,నల్ల నువ్వులు, ఒక కప్పు బియ్యపు పిండి, ఒక కప్పు బెల్లం, మూడు గ్లాస్ లు నీరు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొద్దిగా పచ్చి కొబ్బరి, ఈ అప్పాలను కాల్చుకోవడానికి సరిపడా నూనెను తీసుకోవాలి.

రాగి పిండి అప్పాల తయారి విధానం : ముందుగా ఒక చిన్న పాత్ర తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా బెల్లంను వేసి మీడియం మంటపై ఉంచి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇంకా దీనిని లేత పాకం లా అయ్యే వరకు పొయ్యి మీదే ఉంచాలి. ఇంకా కొద్దీ సేపటి తరవాత ఈ మిశ్రమాన్ని తీసుకుని 5 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

రాగి పిండి అప్పాల తయారి విధానం స్టెప్ 1 : ఈ బెల్లం పాకాన్ని దానిలో కొద్దీ కొద్దిగా రాగి పిండిని కొంచం కొంచం వేస్తూ ఒక గరిటెతో కలుపుకోవాలి. ఒక ముఖ్య విషయం దీనిని ముద్ద ,ముద్దలుగా లేకుండా ఈ పిండిని దీనిలో కలిసిపోయే వరకు తిప్పుకోవాలి. ఇంకా పిండి ముద్దలుగా ఉంటే అప్పాలు పొంగవు అలాగే ఇవి సరిగా రావు కూడా.

రాగి పిండి అప్పాల తయారి విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు ఒక కవర్ తీసుకుని దానికి కొద్దిగా నూనె రాసి, ఆ తరవాత మీ చేతులకి కూడా రాసుకుని వీటిని చిన్న చిన్న లడ్డులుగా చేసుకోవాలి. నూనె బాగా కాగిన తరవాత పప్పలుగా చేసుకుని వీటిని ఒత్తాలి. మరి హాయ్ మీద కాకుండా మీడియం మంట మీద కాల్చుకోవాలి. ఎర్రగా పొంగిన తరవాత తీసి పాత్రలో నిల్వ చేసుకోవాలి.