
కొబ్బరి నువ్వుల లడ్డూలు అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా దీనిలో కొద్దిగా చక్కెర వేస్తే స్వీట్ గా ఉంటుంది. లేదా బెల్లం అయినా దీనిలో వేసుకోవచ్చు పట్టణంలో కంటే పల్లెటూర్లలోనే వీటిని ఇష్టంగా తింటారు. ఇంకా సరైన కొలతలతో చేస్తే ఏ ఉండలు వీటి ముందు అస్సలు సరిపోవు మరి అంత రుచిగా ఉంటాయి ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

కొబ్బరి నువ్వుల లడ్డూలకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు నువ్వులురవ్వ ఎండు కొబ్బరి తురుము, పంచదార లేదా బెల్లం తురుము, 10 జీడిపప్పు, 10 కిస్మిస్, పిస్తా పప్పులు , రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి, ఒక కప్పు పాలు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ను తీసుకోవాలి.

కొబ్బరి నువ్వుల లడ్డూలు తయారీ విధానం: ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇంకా గ్యాస్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, పిస్తాలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, నువు పిండిని కూడా సిద్ధం చేసుకుని మంచిగా పెట్టుకోవాలి

ఒక గిన్నెలో నువ్వుల పిండి వేసి దానిలో నెయ్యి వేసి ఎండు కొబ్బరిని కూడా కలిపి పాన్ లో బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత బెల్లం పాకం కూడా చేసుకోవాలి. అలాగే పంచదార కరిగిన తర్వాత నువ్వుల పిండి యాలకుల పొడి వేసి దీనిలో మిక్స్ అయ్యేలా వీటిని కలుపుకోవాలి. ఆ తరవాత కొద్దీ కొద్దిగా తీసుకుని ఉండలు చేసుకోవడమే.

చివర్లో లడ్డూలును ఇలా చేసుకోవాలి: ఇక చివర్లో వీటిని చిన్న చిన్న ఉండలు మాదిరి చేసుకుని ఒక గిన్నెలో కానీ ప్లేట్ లో కానీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే, ఇంకా దీనిలో పిస్తా పప్పులు కూడా దీనిలో వేసుకోవచ్చు. అలాగే ఈ లడ్డూలను ఒక ప్లేట్‌లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత తినాలి. ఇలా చేస్తే వారం వరకు నిల్వ ఉంటుంది.