
మన బిజినెస్‌లో భాగా రాణించాలి అనుకుంటే మొదట మన చిత్ర గురించి తెలుసుకోవడం ముఖ్యం. గత కొన్నేళ్లు మన దేశంలో తిరుగులేని వ్యాపారాల్లో ఆహారం, విద్య, నిత్యావసర వస్తువులు, ఆరోగ్యం అగ్రగామికి నిలుస్తున్నాయి. ఈ రంగాలు మానవ మనుగడకు ఎంతో కీలకం. కాబట్టి మీరు ఇలాంటి వాటిపై పెట్టుబడి పెడితే, మీకు ఖచ్చితంగా లాభం వస్తుంది.

ఫుడ్, గ్రోసరీస్: ప్రతి ఒక్కరికి ఆహారం ఒక ప్రాథమిక అవసరం కాబట్టి, ఈ వ్యాపారం ఎప్పటికీ విఫలం కాదు. టిఫిన్ సెంటర్, ఫుడ్ హోమ్ డెలివరీ లేదా ఒక చిన్న హోటల్ వంటివి ఇతర వ్యాపారాల కంటే 5 రెట్లు అధిక లాభాలతో మంచి ఆదాయాన్ని అందిస్తాయి. అలాగే నిత్యావసర వస్తువుల దుఖానాలు ఇవి కూడా మన రోజువారి లైఫ్‌లో ఎంతో ముఖ్యం. అందుకే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చినా కూడా, సామాన్యుడి మొదటి ఎంపిక దగ్గరలోని కిరాణా దుకాణమే అవుతుంది. కాబట్టి ఇవి కూడా మంచి లాభాలను తెచ్చిపెడతాయి.

విద్యా, వైద్యం: భారతదేశంలో వేంగంగా ఎదుగుతున్న రంగాల్లో విద్యా, వైద్యం కూడా టాప్‌లో ఉన్నాయి. ట్యూటరింగ్ క్లాస్, కోచింగ్ సెంటర్ లేదా ఆన్‌లైన్ కోచింట్ సెంటర్ ప్రారంభించడం ద్వారా మీరు నిరంతర ఆదాయాన్ని పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మీరు కోచింగ్ ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని గడించవచ్చు. అలాగే ఆరోగ్యం, మానవుడు సురక్షితంగా జీవించాలంటే వైద్యం ముఖ్యం. ఆసుపత్రుల సమీపంలో లేదా రద్దీగా ఉండే ప్రాంతంలో ఫార్మసీని ప్రారంభించడం ద్వారా స్థిరమైన ఆదాయం లభిస్తుంది. మీరు జెనరిక్ మందులను అమ్మడం ద్వారా లాభం పొందవచ్చు.

అద్దె భవనాలు: ప్రస్తతం పెరుగుతన్న వలసల నేపథ్యంలో ప్రధాన నగరాల్లో ఇళ్లు, ఆఫీస్‌లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. మీ దగ్గర డబ్బులు ఉంటే ఒక ఖాళీ స్థలం తీసుకోని దానిలో ఒక బిల్డింగ్ నిర్మించి వాటిని రెంట్‌కు ఇవ్వండి. మీరు ఇళ్లను అద్దెకు ఇవ్వడం ద్వారా లేదా ప్రాపర్టీ కన్సల్టెంట్‌గా పనిచేయడం ద్వారా పెద్దగా శ్రమపడకుండా స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు.

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్: ఆన్‌లైన్ చెల్లింపులు, హోమ్ డెలివరీ వంటి సౌకర్యాలను అందించడం ద్వారా కూడా మీరు ఆదాయాన్ని పొందవచ్చు. ఏవైనా ఈ కామర్స్ ప్లాట్‌మామ్స్‌లోని వస్తువులను హోట్ డెలివరీ చేస్తూ మీరు ఆదాయం గడించవచ్చు. మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా, ముందుగా స్థానిక మార్కెట్ అవసరాలను తెలుసుకోండి. ( Note పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆదారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించడం లేదు)