
పొడుపు కథలు ఎప్పుడైనా చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఒక్కసారి వినగానే తెలిసినట్టే ఉంటుంది కానీ ఆన్సర్ మాత్రం అసలు చెప్పలేము. ఇలా చాలా మంది పప్పులో కాలేస్తారు కానీ, ఇవే మెదడుకు పదును పెడతాయి. మీకోసం ఒక పొడుపు కథ రెడీగా ఉంది. మరి, అసలు లేట్ చేయకుండా ఇది ఏంటి? దీనికి మనం జవాబు చెప్పగలమా లేదా అనేది ఇక్కడ చూద్దాం..

మీరు కాసేపు ఒక చీకటి గదిలో ఉన్నారని ఊహించుకుందాం. ఆ గదిలో కొంచం కూడా లైట్ వెలుతురు లేనే లేదు.. ఇంకా మీ చుట్టూ ఏ వస్తువూ కూడా మీకు సరిగ్గా కనిపించడం లేదు. అసలే ఒంటరిగా ఆ గదిలో ఉన్నారు. ఈ సమయంలో మీ చేతిలో ఏం లేవు ఒక్క అగ్గిపుల్ల తప్ప..

ఇంకా మీ దగ్గర ఒక్కటే అగ్గిపుల్ల ఉంది. ఆ సమయంలో ఎలా ఆలోచిస్తారు చిన్న అగ్గిపుల్ల అని తీసిపడేస్తారా? నిజం చెప్పాలంటే మీకు వెలుతురు అది తప్ప వేరేది ఏది ఆ సమయంలో అస్సలు లేదు ఇంకా ఇంకో వస్తువు కూడా లేనే లేదు. మరి, ఇప్పుడు మీరు ఏం చేయాలో ఆలోచించాలి

ఇంకా మీ ఎదురుగా ఒక కిరోసిన్ దీపం మాత్రమే ఉంది. ఇంకా దీని పక్కనే ఒక చిన్న కొవ్వొత్తి కూడా ఉంది. అలాగే, ఈ రెండింటిలో దేన్ని ముందుగా వెలిగిస్తారు బాగా ఆలోచిస్తే తప్ప దీనికి సమాధానం దొరకదు ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు మెదడుకి మంచి పదును పెడతాయి.

అసలే గది మొత్తం చీకటిగా ఉంది.. పైగా మీరొక్కరే ఉన్నారు మీకు చిన్న వెలుతురు కావాలి. కానీ మీ దగ్గర ఒక్క అగ్గిపుల్ల మాత్రమే ఉంది. కిరోసిన్ దీపాన్ని వెలిగించాలన్నా, ఇంకా కొవ్వొత్తిని వెలిగించాలన్నా ముందుగా ఏదో ఒకటి కచ్చితంగా చేయాలి. మరి మీరు ముందు మొదటగా ఏది వెలిగిస్తారు? దీనికి చాలా మంది కిరోసిన్ దీపాన్నా? కొవ్వొత్తినా? అని ఆలోచిస్తారు, కానీ ఒక్కటి వాటి కన్నా ముందు మొదట అగ్గిపుల్లనే వెలిగించాలి.