PM Modi: గిర్‌ అభయారణ్యంలో పర్యటించిన ప్రధాని మోదీ! సింహాలను ఫొటోలు తీస్తూ..

Updated on: Mar 03, 2025 | 11:05 AM

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు. ఆసియా సింహాలను చూసి ఆయన ఫోటోలు తీశారు. జునాగఢ్‌లో జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొనే ముందు, 20.24 హెక్టార్లలో వన్యప్రాణి ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ప్రకటించారు. వన్యప్రాణి సంరక్షణకు ఇది మంచి అడుగు అని పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు.

1 / 5
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో పర్యటించారు. ఈ రోజు(మార్చ్‌ 3) ప్రపంచ వన్యప్రాణి దినోత్సం సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటన అనంతరం ప్రధాని జునాగఢలోని ససాన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు సమావేశంలో పాల్గొంటారు.

2 / 5
గిర్‌ అభయారణ్యంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ స్వయంగా కెమెరాతో అక్కడున్న సింహాలను ఫొటోలు తీయడం విశేషం. ప్రధాని మోదీకి వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫీ అంటే ఇష్టం అనే విషయం తెలిసిందే. గతంలో పలు సందర్భాల్లో కూడా మోదీ కెమెరాతో వన్యప్రాణుల ఫొటోలు క్లిక్‌మనిపించారు.

3 / 5
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా జునాగఢ్‌ జిల్లాలోని న్యూ పిపాలియా వద్ద 20.24 హెక్టార్లలో నేషనల్‌ రెఫరల్‌ సెంటర్‌ ఫర్‌ వైల్డ్‌ లైప్ హెల్త్‌ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లోని తొమ్మిది జిల్లాలోని 53 తాలుకాల్లో సుమారు 30 చదరపు కిలో మీటర్లలో సింహాల ఆవాసాలు ఉన్నాయి. దీన్ని ఆసియా సింహాల నేలగా కూడా పిలుస్తారు.

4 / 5
ప్రధాని నరేంద్ర మోదీ గిర్‌ అభయారణ్య పర్యటన సందర్భంగా రాజ్యసభ ఎంపీ పరిమల్‌ నత్వానీ ఎక్స్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. భారతదేశ సింహం, గుజరాత్‌గర్వించదగ్గ కుమారుడు, ప్రధాని మోదీ ఆసియా సింహాల భూమిని సందర్శిస్తున్నారని రాసుకొచ్చారు.

5 / 5
వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ డే సందర్భంగా ప్రధాని మోదీ గిర్‌ సందర్శన వన్యప్రాణుల సంరక్షణను మరింత పెంపొందిచే అవకాశం ఉంది. వన్యప్రాణుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా వన్యప్రాణుల ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.