Egg Fried Rice: మిగిలిపోయిన అన్నంతో ఎగ్ రైస్.. 5 నిమిషాల్లో లంచ్ బాక్స్‌ రెడీ

Updated on: Nov 01, 2026 | 6:15 PM

 ఇంట్లో రాత్రి వండిన అన్నం మిగిలిపోతే దాన్ని పడేయకుండా లేదా మరుసటి రోజు ఉదయం ఏం టిఫిన్ చేయాలో తోచనప్పుడు, పిల్లల లంచ్ బాక్స్‌ల కోసం తక్కువ సమయంలో రుచికరంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎగ్ రైస్ ఒక తిరుగులేని వంటకం . ఎలాంటి సాస్‌లు వాడకుండా సహజసిద్ధమైన వంటింటి దినుసులతోనే స్ట్రీట్ ఫుడ్ బండ్లపై చేసేలా ఘాటైన స్మోకీ ఫ్లేవర్‌తో ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్‌గా తయారుచేసుకోవచ్చు.

1 / 5
కావలసిన పదార్థాలు: 1 పెద్ద కప్పు మిగిలిపోయిన చల్లన్నం లేదా వేడి అన్నం, 4 కోడిగుడ్లు, సన్నగా తరిగిన 1 చిన్న ఉల్లిపాయ, పావు కప్పు క్యాప్సికమ్ తరుగు, పావు కప్పు టమాటా తరుగు, సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిర్చి, 1 టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ ఆవాలు, 2 రెమ్మల తాజా కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం పొడి, అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి, 1 చిన్న నిమ్మకాయ రసం నిమ్మరసం, సాల్ట్, చిన్న కట్ట తాజా కొత్తిమీర తరుగు, 3 టేబుల్ స్పూన్ల వంట నూనె

2 / 5
తయారీ విధానం:  స్టవ్‌పై మూకుడు పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత 4 కోడిగుడ్లను పగలగొట్టి వేసి.. కదపకుండా 30 నుండి 40 సెకన్ల పాటు అలాగే ఉంచాలి. గుడ్డు అడుగున వేగడం ప్రారంభించాక నెమ్మదిగా గరిటెతో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తూ తిప్పాలి మరీ చిన్నగా చిదుము చేయకూడదు. ఇందులో 2 చిటికెల ఉప్పు చల్లి.. కేవలం 1 నిమిషం మాత్రమే వేయించాలి. గుడ్డుపై తెల్లటి నురగ రావడం మొదలవ్వగానే వెంటనే జల్లి గరిటెతో ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ సేపు వేపితే రబ్బరులా సాగుతుంది.

3 / 5
అదే కడాయిలో మరో 1 టీస్పూన్ నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పావు టీస్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 టీస్పూన్ జీలకర్ర వేసి హై ఫ్లేమ్‌పై టాస్ చేయాలి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన పచ్చిమిర్చి వేసి 30 సెకన్లు వేపాలి. ఆ తర్వాత పావు కప్పు క్యాప్సికమ్ తరుగు, పావు కప్పు టమాటా తరుగు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ కారం వేసి కలపాలి. టమాటాపై తొక్క విడివడి గుజ్జుగా మెత్తబడే వరకు హై ఫ్లేమ్‌పైనే వేయించాలి.

4 / 5
టమాటా మగ్గిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్డు ముక్కలను వేసి ఒక్క నిమిషం పాటు వేగంగా కలపాలి. ఇప్పుడు 1 కప్పు  పొడిపొడిగా ఉన్న అన్నాన్ని వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి అన్నంలోని ప్రతి మెతుకు వేడెక్కేలా, గరిటెతో అడుగు నుంచి పైకి లేపుతూ 2 నిమిషాలు వేగంగా టాస్ చేయాలి.

5 / 5
అన్నం బాగా వేడెక్కి మసాలా పట్టిన తర్వాత.. అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు చల్లి, 1 చిన్న నిమ్మకాయ రసాన్ని పిండాలి. వెంటనే స్టవ్ ఆపేసి అంతా కలిసేలా వేగంగా టాస్ చేసి దింపేయాలి. అంతే, నోరూరించే స్ట్రీట్ స్టైల్ 'ఎగ్ రైస్' సిద్ధం! వేడివేడిగా ప్లేట్‌లో వడ్డించుకుని తింటుంటే మిరియాల ఘాటు, నిమ్మరసం పులుపు, పెద్ద పెద్ద గుడ్డు ముక్కలతో కలగలిసి రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే అద్భుతమైన రుచినిస్తుంది!

Loading...
Unable to load recommendations.
Follow Us