
పచ్చి కొబ్బరి, అటుకులు కలిపి ఇలా పాయసం చేస్తే తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఒక గిన్నెడు తింటే చాలు టేస్టీగా కమ్మగా ఉంటుంది. బెల్లం, పంచదారతో కలిపి చేస్తారు. నేటికీ కూడా దీనిని ఎంతో మంది తింటారు. పచ్చి పాలు కూడా పోస్తారు కాబట్టి ఆరోగ్యానికి ఎంతో బలం కూడా. ఈ పాయసాన్ని మీరు మీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా తయారు చేసుకుని మంచిగా తినొచ్చు. మరి, లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చదివి తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి పాలు, అర కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు లేదా పేస్ట్, రెండు కప్పుల బియ్యం, అర కప్పు అటుకులు,ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పున్నర పంచదార, కొద్దిగా ఉప్పు వేస్తే రుచికి మంచిగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి,5 జీడిపప్పు, 5 కిస్‌మిస్, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి.

పచ్చి కొబ్బరి అటుకుల పాయసం తయారి విధానం : ముందుగా అర కప్పు అటుకులను తీసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చి కొబ్బరి, పచ్చి పాలను సిద్ధం చేసుకోవాలి.ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు పాలు పోసి వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకుని మెత్తగా పట్టుకోవాలి. దీని నుంచే వచ్చే పాలను వేరే దానిలోకి తీసుకోవాలి. ఒక గ్లాస్ లోకి తీసుకుని వాటిని పక్కన పెట్టాలి వీటితోనే అసలు రుచి వస్తుంది.

పచ్చి కొబ్బరి అటుకుల పాయసం తయారి విధానం స్టెప్ 2: ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి ఆ తర్వాత దీని మీద ఒక పాన్ పెట్టి దానిలో టీ స్పూన్ నెయ్యి వేసి దానిలో నాలుగు జీడిపప్పు, కిస్‌మిస్ వేసి వేయించి గిన్నె లేదా ప్లేట్ లో వీటిని పెట్టుకోవాలి. అయితే, జీడిపప్పులను చిన్న చిన్న ముక్కలుగా చేస్తే మంచిగా అవుతాయి, చివర్లో ఇది వేస్తే నోటికి కూడా మంచి రుచి ఉంటుంది.

పచ్చి కొబ్బరి పాయసం తయారి విధానం స్టెప్ 3 : ఇంకో పాన్ తీసుకుని దానిలో కొబ్బరి పాలు, ఇంకో కప్పు నార్మల్ పాలు పోసి మరిగించాలి. ఇది కొంచం చిక్కగా అయ్యాక దీనిలో బెల్లం ముక్కలు వేసి బాగా మిక్స్ అయ్యేలా వీటిని కలుపుకోవాలి. కొద్దీ సేపటీ తర్వాత అర కప్పు అటుకులు, రెండు కప్పుల బియ్యం వేయాలి. వేడి మీద ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. అంతే, వేడి వేడి పచ్చి కొబ్బరి పాయసం రెడీ.