పాములను చంపితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష..! నమ్మరు కానీ.. ఇదే నిజం..

Updated on: Feb 22, 2026 | 1:11 PM

కొందరు పాములను చూస్తే భయపడి పారిపోతుంటారు. ఇంకొందరు వాటిని కర్రతో కొట్టి చంపుతారు. పాములను చంపితే చట్టరీత్యా నేరమని అధికారులు చెబుతున్నారు. అలాగే, పాములను చంపితే జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా కొన్ని సార్లు అయితే ఫైన్ కూడా పడే అవకాశం ఉంది.

1 / 5
వరల్డ్ వైడ్ గా మొత్తం 300 రకాలకు పైగా పాములు ఉంటే, వాటిలో 50 రకాల పాములు మాత్రం అత్యంత  విషపూరితమైనవి. అయితే, వాటిలో కొన్ని నీళ్ళలో ఉంటే ఇంకొన్ని భూమి మీద ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

2 / 5
ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. పాములను చంపకూడదు.. ఇది చట్టరీత్యా నేరం. కానీ, దీనిగురించి ఎవరికీ తెలియదు. పాములను కొట్టి చంపినా వాటిపైన రాళ్లు విసిరినా ఏడేళ్ల  జైలు శిక్ష పడుతుందని అధికారులు చెప్పారు.

3 / 5
పాము మీకు ఎదురైనా.. మీ కంటపడినా దాన్ని వెంబడించి చంపకండి. వాటికీ  దూరంగా వెళ్ళండి. పాములు తమను తాము కాపాడుకోవడానికి మాత్రమే మనుషుల మీద దాడి చేస్తాయని అధికారులు వివరించారు.

4 / 5
ప్రతి ఏడాది దేశంలో లక్షకు పైగా పాము కాటు వలన మరణిస్తున్నారు. దీనిలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా  పాము కాటుకు గురవుతున్నారని తెలిపారు. దీనిని ఎలా అయినా అరికట్టాలని కొందరు పల్లెటూర్లలో అవగాహన  కార్యక్రమాలు చేపడుతున్నారు.

5 / 5
ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన కొంత వరకు అయినా ఇవి తగ్గుతాయి. పాము కనిపించిన వెంటనే దాని వెంటపడి   చంపకుండా, స్నేక్ క్యాచర్లకు సమాచారం అందిస్తే వాళ్ళు పట్టుకుని అడవుల్లో వదిలిపెడతారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇది పాటించాలని అధికారులు సూచించారు.

Follow Us