
వానాకాలంలో టిఫిన్ చేయాలంటే కొంచం ఇబ్బంది గానే ఉంటుంది ఇక ఇలాంటి సమయంలో పిండి రుబ్బే టెన్షన్ లేకుండా.. కప్పు ఓట్స్, టమాటాతో కిర్రాక్ టిఫిన్ చేసి తింటే, రోజంతా ఎనర్జీగా ఉంటారు. మరి, అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

ఓట్స్, ఉల్లిపాయ, టమాటాతో ఎగ్ ఆమ్లెట్ కు కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఓట్స్ , 3 కోడిగుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా , నాలుగు పచ్చిమిర్చి , ఇంకా కొద్దిగా కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యిను తీసుకోవాలి. దీనిని సరైన రీతిలో చేస్తే టేస్టీగా ఉంటుంది

ఓట్స్, ఉల్లిపాయ, టమాటాతో ఎగ్ ఆమ్లెట్ కు తయారీ విధానం: ముందుగా ఓట్స్‌ను తీసుకుని వీటిని చక్కగా క్లీన్ చేసి ఆ తరువాత దీనిని మిక్సీలో వేసి మెత్త మెత్తగా పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత ఇంకో గిన్నె తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి.

ఓట్స్, ఉల్లిపాయ, టమాటాతో ఎగ్ ఆమ్లెట్ కు తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు రెండు గుడ్లు పగలగొట్టి ఈ కారం మిశ్రమంలో వేసి దీనిని కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక కప్పు ఓట్స్ పొడి, కట్ చేసిన ఉల్లిపాయ, ఇంకా టమాటా ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి ముక్కలు , ఇంకా కొత్తిమీర వేసి దీనిని బాగా కలుపుకోవాలి.

ఇక ఇప్పుడు దీనిలో మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తరవాత పొయ్యి మీద పాన్ పెట్టి దానిని బాగా వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేసి మీరు రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లాగా పోసుకోవాలి. ఇక ఇప్పుడు 3 నిముషాలు మూతపెట్టి మీడియం మంటపై కాల్చుకోవాలి. ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. అంతే, వేడి వేడి ఆమ్లెట్ రెడీ.