RCB Edition: క్రికెట్ లవర్స్‌కు నథింగ్ క్రేజీ సర్‌ప్రైజ్.. RCB ఎడిషన్‌తో మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌.. డిజైన్ చూస్తే..

Updated on: Jul 05, 2026 | 6:15 PM

Nothing Phone RCB Edition: క్రికెట్‌ లవర్స్.. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.. నథింగ్ ఫోన్ ఇండియా అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ జట్టు జెర్సీ, అండ్‌ లోగో లుక్‌తో ప్రత్యేకంగా నథింగ్ ఫోన్ 4B అనే సరికొత్త ఆర్సీబీ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను జులై 7వ తేదీన లాంఛ్ చేయున్నట్టు కంపెనీ తెలిపింది.

1 / 5
ఆర్సీబీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా రెండు కప్‌లతో ఊపుమీదున్న ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ.. నథింగ్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెట్టుకు అంకితం చేస్తూ ఆర్సీబీ లోగోతో నథింగ్ 4B అనే అనే సరికొత్త ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను జూలై 7న బెంగళూరులోని నథింగ్ స్టోర్‌లో లాంచ్ చేయనుంది. మరీ స్పెషల్ ఎడిషన్‌ ఫోన్‌లో ఉన్న ఫీచర్స్ ఏంటో చూసేద్దాం పదండి.

2 / 5
నథింగ్ అంటేనే.. కొత్త కొత్త ప్రయోగాలకు పెట్టింది పేరు.. స్మార్ట్‌ ఫోన్ రంగంలో ఈ ఒక్క కంపెనీ మాత్రమే.. సరికొత్త డిజైన్‌లలో ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. అదే స్పూర్తితో క్రికెట్, టెక్ లవర్స్‌ను ఆకట్టుకునేలా తన బ్రాండ్‌కు ఉన్న సిగ్నేచర్ మినిమలిస్ట్ లుక్‌తో పాటు, ఆర్‌సిబి వైబ్రంట్ కలర్స్‌తో అదిరిపోయే లుక్‌లో ఈ ప్రత్యేక ఎడిషన్‌ను డిజైన్ చేసింది. ఆర్సీబీ లోగో, కలర్స్‌తో వచ్చే ఈ ఫ్యాన్స్‌కు ఇదో అరుదైన కలెక్టబుల్ ఐటమ్‌గా నిలుస్తుంది

3 / 5
అయితే ఇక్కడో సమస్య ఏమిటంటే.. నథింగ్ ఈ ఫోన్‌ను దేశ వ్యాప్తంగా తీసుకురావడం లేదు. కేవలంలో ఈ స్మార్ట్‌ఫోన్ బెంగళూరులోని 'నథింగ్ స్టోర్' లో మాత్రమే లభిస్తుంది. జులై 7వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి కస్టమర్స్‌కు అందుబాటులోకి వస్తుంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి స్టాక్ త్వరగా అయిపోవచ్చు. మీరు కూడా ఈ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే.. రిలీజైన వెంటనే స్టోర్‌కు వెళ్లడం బెటర్

4 / 5
ఇప్పటికే కొత్త కొత్త డిజైన్‌లో స్మార్ట్ ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న నథింగ్ ఇండియన్ మార్కెట్‌లో తన బ్రాండ్‌ను మరింత ప్రమోట్ చేసుకోవడానికి..ఇక్కడి పాపులర్ స్పోర్ట్స్, కల్చర్‌ను వాడుకుంటూ ఈ విధమైన భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ సరికొత్త కొలాబరేషన్ అటు టెక్ ప్రియుల్లోనూ, ఇటు క్రికెట్ ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలను పెంచింది.

5 / 5
ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 6.7 ఇంచెస్‌ Full HD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 16MP ఫ్రంట్ కెమెరా, 50 MP బ్యాక్‌ కెమరాతో వస్తుంది. అలాగే 6000 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, 8GB RAM తో పాటు 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇక ధర విషయానికి వస్తే.. రూ.20 నుంచి 25 వేల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

Follow Us