
పుల్ల పుల్లగా నిమ్మకాయ పచ్చడి ఇలా చేసి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా నోరు చేదుగా ఉన్నప్పుడు కూడా దీనిని తినొచ్చు. తినేకొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది. చాలా మంది నూనె వేసి చేస్తారు అయితే నూనె ఒక్క చుక్క కూడా వాడకుండా నిమ్మకాయ పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

కొందరు ఊరగాయలు బాగా తింటారు అలాంటి వారు పుల్లని నిమ్మకాయ పచ్చడి చేసుకుంటే తింటే రుచిగా ఉంటుంది. ఇంకా దీనిని పప్పు, అన్నంతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా రొట్టెను ఇలా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. నూనెతో చేసిన నిమ్మ పచ్చడి తినేందుకు ఆలోచిస్తారు. అసలు నూనె వాడకుండా ఇంట్లోనే కమ్మగా చేసుకోవచ్చు.

మీడియం సైజు నిమ్మకాయలు 10 వరకు తీసి వాటిని బాగా కడిగి పెట్టుకోవాలి. అలాగే, మూడు స్పూన్ల ఆవాలు, ఇంకా ఒక టీ స్పూన్ సోంపు, ఒక స్పూను పసుపు , ఇంకా పావు టీ స్పూను ఇంగువ, ఇంకా రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూను నల్ల మిరియాలను కూడా తీసుకోవాలి.

ముందుగా నిమ్మకాయలను తీసుకుని బాగా కడిగి తేమ లేకుండా వాటిని కడిగి పక్కన పెట్టాలి. వీటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని వాటి నుంచి రసాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఈ రసాన్ని తరవాత వేస్తె ఈ నిమ్మపచ్చడికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో కొద్దిగా సోంపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచం వాము, ఇంకా నల్ల మిరియాలు కూడా వేసి బాగా వేయించాలి.

అలాగే ఈ ఆవాలు, కొద్దిగా సోంపు, పసుపు నల్ల ఉప్పు కూడా వేసి మెత్తగా.. పొడిలా చేసుకోవాలి. అలాగే సోంపు మిశ్రమాన్ని కూడా దీన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఒక గాజు సీసా తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేయాలి. చివర్లో నిమ్మరసం కూడా వేసి కలుపుకోవాలి. ఆ తరవాత నిమ్మకాయ ముక్కలు కూడా దీనిలో వేయాలి. ఇవి మునిగేంత వరకు నిమ్మరసం వేయాలి. రెండు రోజుల తరవాత నిమ్మకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఒక్క చుక్క నూనె కూడా లేదు కాబట్టి మంచిగా తినొచ్చు .