నెల్లూరు నెత్తల పులుసు .. ఇలా చేస్తే చాలు ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే!

Updated on: Jun 02, 2026 | 7:50 PM

చేపల పులుసు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం ఉంటుంది. మరీ ముఖ్యంగా మృగశిర కూడా రాబోతుంది. ఇక ఈ సమయంలో చాలా మంది చేపలు ఎక్కువగా తింటారు. అయితే అన్ని చేపల కంటే, నెల్లూరు చేపలు అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. అయితే నెల్లూరు చేపలే కాదండోయ్.. నెత్తళ్లు కూడా ఇలా పులుసు చేసుకొని తింటే ఆ రుచికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందేనంట. కాగా, నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : నెత్తళ్లు, చింత పండు, ఉల్లిపాయలు, అల్లం వెల్లులి పేస్ట్, కొత్తిమీర, ధనియాల పొడి, మెంతి పొడి, ఆవాలు , జీలకర్ర, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చి మిర్చీ రెండు.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా నెత్తళ్లు తీసుకొని మంచి శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు రాసి  పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, నూనె పోసి నూనె వేడి చేసుకోవాలి. తర్వాత అందులో మెంతులు, జీలకర్ర, ఎండు మిర్చీ కరివేపాకు వేసి మంచిగా వేయిచుకోవాలి.

3 / 5
ఇవి బాగా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చీ వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. దీని తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మరో నిమిషం పాటు మంచిగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత చింత పండు రసం పోయాలి. తర్వాత పది నిమిషాల పాటు పులుసు బాగా మరిగేలా చూసుకోవాలి.

4 / 5
దీని తర్వాత పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా శుబ్రం చేసి పెట్టుకున్న నెత్తళ్లు అందులో వేయాలి. గరిటతో ఎప్పుడూ కలపకూడదు, దీని వలన అవి విరిగిపోయే ఛాన్స్ ఉంది,కాబట్టి కడాయి పట్టుకొని అటు ఇటు కదుపుతూ ఉండాలి అంతే.

5 / 5
ఇక పులుసు బాగా మరిగిన తర్వాత మసాలాలు, ధనియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి, మరో ఐదు నుంచి పదినిమిషాల వరకు మంచిగా పులుసు మరిగేలా చూసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ నెల్లూరు నెత్తళ్ల పులుసు రెడీ, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ముద్ద ముద్దకు ఆహా అంటారు.

Follow Us