
ప్రెజర్ కుక్కర్ : మీ ఇంట్లో ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు ఈ కూరను చెయ్యడం చాలా ఈజీ. దీనిలో ఉడికిస్తే మాంసం మెత్త బడుతుంది. తలకాయ కూరకు ప్రెజర్ కుక్కర్ బెటర్. మీరు తీసుకునే మాంసం ముక్కలను బట్టి విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి.

పచ్చిపప్పాయ: మీరు తలకాయ మాంసం వండే ముందు పచ్చిపప్పాయ ముక్కలను తీసుకుని వాటిని మిక్సీలో పేస్ట్ చేసుకుని మ్యారినేట్ చేయడం వల్ల మాంసం మెత్తబడి కొద్దీ నిముషాల్లోనే ఉడుకుతుంది.

వేడి నీళ్ళు: మీరు తలకాయ మాంసం వండే ముందు కూరలో చల్లటి నీళ్ళు పోయకుండా, ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోస్తే మాంసం బాగా ఉడుకుతుంది. తినడానికి కూడా రుచిగా ఉంటుంది. అలాగే ఉడికించేటప్పుడే టేస్ట్ కి తగ్గ ఉప్పు వేస్తే బాగా ఉడుకుతుంది.

ఇంకా ముదురు మటన్ మెత్తగా త్వరగా ఉడికించాలంటే ప్రెషర్ కుక్కర్ చాలా బెటర్. దీనిలో మటన్ ముక్కలు వేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే చాలు. ముదురు మటన్ మొత్తం లేత మటన్ లాగా అవుతుంది. ఈ సారి మీరు ముదురు మటన్ వండేటప్పుడు ఈ ఇంటి చిట్కాను పాటించండి. 15 నిముషాల్లో అయ్యే కూర తక్కువ సమయంలోనే అయిపోతోంది.

ఈ చిట్కాను అస్సలు మర్చిపోకండి: మేక తలకాయ మాంసం ఉడికించేటప్పుడు ముందుగా 10 నుంచి 15 నిమిషాల పాటు హై మంట మీద ఉంచి ఉడికిస్తే మాంసం ముక్క మెత్తబడుతుంది. అలాగే దీనిని తినేటప్పుడు జ్యుసీగా, మెత్తగా కూడా ఉంటుంది. కాబట్టి, మీ ఇంట్లో వండేటప్పుడు ఇలా ట్రై చేయండి.