
మష్రూమ్ దొండకాయ కూర గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రుచికరమైన ఫుడ్. ఎందుకంటే, ఈ పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ డి వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. ఇది చపాతీల్లోకి మంచిగా ఉంటుంది.

మష్రూమ్ దొండకాయను ఎలా వండాలంటే.. ముందుగా పుట్టగొడుగులను క్లీన్ చేసి ముక్కలుగా చేసుకోవాలి. ఆ తర్వాత దొండకాయలను కూడా నీళ్ళతో కడిగి ముక్కలుగా చేసుకోవాలి.

ఇక ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనె వేసి అది వేడయ్యాక, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వాటిని బాగా వేయించాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు టొమాటో ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి.

ఇక ఆ తర్వాత పుట్టగొడుగులను ముక్కలు కూడా వేసి వాటిని బాగా ఉడికించాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న దొండకాయలు వేసి 15 నిమిషాల పాటు వాటిని బాగా ఉడికించాలి. అంతే, మష్రూమ్ దొండకాయ కూర రెడీ.