ఒక్క ముద్దతో వెయ్యేనుగుల బలం.. పిల్లలకు ఇదే వరం

Updated on: Nov 25, 2026 | 3:27 PM

మునగాకు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో ఐరన్, కాల్షియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ దీంతో రకరకాల వంటలు ప్రిపేర్ చేసుకుంటారు. అయితే పిల్లలకు దీంతో లడ్డూ చేసి పెడితే వారికి వెయ్యేనుగుల బలం వస్తుందంట. కాగా, వాటిని ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసేద్దాం.

1 / 5
మునగాకు లడ్డూల తయారీకి ముందుగా పొట్టు మినప్పప్పు, బాదం పప్పులు, జీడిపప్పు, పల్లీలు, సన్‌ఫ్లవర్ సీడ్స్, నువ్వులు వంటి పోషక విలువలున్న పదార్థాలను నెయ్యిలో విడివిడిగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లబరచాలి. తర్వాత మునగాకు తయారు చేసుకోవాలి.

2 / 5
దీని కోసం రెండు కప్పుల శుభ్రం చేసిన మునగాకును రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యిలో వేసి, ఆకు ముద్దలా మారినప్పటికీ నిదానంగా వేయిస్తూ, తేమ పూర్తిగా పోయి క్రిస్పీగా మారే వరకు వేయించుకోవాలి. ఆకుల్లో తేమ ఉండకుండా చూసుకోవడం వల్ల లడ్డూలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఆకు పచ్చి వాసన పోయి, నెయ్యిలో వేగడం వల్ల లడ్డూకు మంచి రుచి వస్తుంది. మునగాకును కూడా పూర్తిగా చల్లబరచాలి.

3 / 5
ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మొదటగా వేయించిన మునగాకును మిక్సీ జార్‌లో వేసి, సగం స్పూన్ యాలకుల పొడి కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత వేయించిన ఖర్జూరాలు (గింజలు తీసి), అర కప్పు బెల్లం పొడి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన వేయించిన నట్స్, గింజలను మిక్సీ జార్‌లో ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.

4 / 5
పప్పులను మధ్యమధ్యలో ఆపుతూ, పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేయాలి. అలా కాకుండా ఒకేసారి గ్రైండ్ చేస్తే వాటిలోని నూనెలు బయటికి వచ్చి ముద్దలా మారుతుంది. పప్పులు కొద్దిగా వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయ్యాక మిగిలిన బెల్లం పొడిని కలిపి గ్రైండ్ చేయాలి. చివరిగా, ముందుగా తయారుచేసుకున్న మునగాకు పొడి మిశ్రమాన్ని కూడా కలిపి పల్స్ మోడ్‌లో ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.

5 / 5
ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకుని, చేత్తో బాగా కలపాలి. ఇందులోని సహజ నూనెల వల్ల అదనంగా నెయ్యి కలపాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవచ్చు. అంతే టేస్టీ టేస్టీ మునగాకు లడ్డూలు రెడీ. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us