Monsoon Haircare: వర్షాకాలంలో ఈ తప్పులు చేశారంటే బట్టతల ఖాయం.. జాగ్రత్త సుమీ!

|

Jun 24, 2024 | 9:07 PM

వేసవిలో జుట్టు సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం జుట్టు ఆరోగ్యానికి సవాలుగా మారుతుంది. తరచూ వర్షంలో తడవడం వల్ల జుట్టు రాలిపోతుంది. దురద, జుట్టు రాలడం, జుట్టు పల్చబడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. జుట్టు సమస్యలు కూడా చర్మ సమస్యల మాదిరిగానే ఈ కాలంలో చుట్టుముడతాయి. వర్షాకాలంలో ఈ సమమ్య మరింత ఎక్కువగా ఉంటుంది. నిజానికి జుట్టు రాలడానికి వివిధ కారణాలున్నాయి..

1 / 5
వేసవిలో జుట్టు సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలం జుట్టు ఆరోగ్యానికి సవాలుగా మారుతుంది. తరచూ వర్షంలో తడవడం వల్ల జుట్టు రాలిపోతుంది. దురద, జుట్టు రాలడం, జుట్టు పల్చబడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. జుట్టు సమస్యలు కూడా చర్మ సమస్యల మాదిరిగానే ఈ కాలంలో చుట్టుముడతాయి. వర్షాకాలంలో ఈ సమమ్య మరింత ఎక్కువగా ఉంటుంది. నిజానికి జుట్టు రాలడానికి వివిధ కారణాలున్నాయి. వాటిలో కర్లర్లు, స్ట్రెయిట్నర్లు వంటి హెయిర్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగించడం కూడా ఒకటి. డ్రై స్ప్రేయింగ్ లాంటి తప్పులు చేయడం వల్ల జుట్టు డ్యామేజ్‌ అవుతుంది.

2 / 5
అలాగే విటమిన్ బి 12, బయోటిన్, ఫోలేట్ వంటి పోషకాల లోపాలు కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. అనారోగ్యకరమైన ఆహారం, హార్మోన్ల అసమతుల్యత అధికంగా జుట్టు రాలడానికి కారణం కావచ్చు. వర్షాకాలంలో గాలిలోని తేమ వల్ల శిరోజాలు ఎండిపోతాయి. ఇది జుట్టు సహజ నూనెలను తొలగించి పొడిగా చేస్తుంది.

3 / 5
తేమతో కూడిన వాతావరణం కారణంగా విపరీతమైన చెమట వస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను మూసుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా తలపై దురద, చికాకు పెరుగుతుంది. జుట్టు మూలాలు కూడా వదులుగా మారుతాయి. దీంతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. వర్షంలో జుట్టు తడిస్తే జుట్టు మెరుపు తగ్గుతుంది. సరిగ్గా జుట్టు ఆరబెట్టుకోకపోతే ఎక్కువ జుట్టు రాలిపోవచ్చు.

4 / 5
తడి జుట్టు దువ్వడం అనేది అతి పెద్ద తప్పు. జుట్టు మూలాలు వదులుగా మారి దెబ్బతింటాయి. జుట్టు రాలడానికి ఇది కూడా ఒక కారణం. వర్షంలో తడిస్తే ముందుగా జుట్టును ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత జుట్టును దువ్వేందుకు ప్రయత్నించాలి. వర్షాకాలంలో గాలిలో వివిధ బ్యాక్టీరియా, క్రిములు, వైరస్‌లు, ధూళి కణాలు ఉంటాయి. ఇవి జుట్టులో చేరితే తల దురద, పొడిగా మారుతుంది. జుట్టులోని మురికి, అదనపు నూనె, సూక్ష్మక్రిములను తొలగించడానికి కనీసం వారానికి మూడు సార్లు తలస్నానం చేయాలి.

5 / 5
బిగుతుగా ఉండే పోనీటెయిల్స్ లేదా బ్రెయిడ్స్ జుట్టుకు హానికరం. ఇది జుట్టు రాలడానికి కారణమవుతుంది. తర్వాత కాలంలో బట్టతలకి దారితీస్తుంది. జుట్టు సమస్యలను తొలగించడానికి ముందుగా మీ జుట్టును స్టైలింగ్ చేయడం ఆపాలి. బ్లో డ్రైయర్‌లు, స్ట్రెయిట్‌నర్లు, కర్లింగ్ ఐరన్‌లు వంటి స్టైలింగ్ సాధనాల వినియోగాన్ని వర్షాకాలంలో తగ్గించాలి. ఇది జుట్టును మరింత డ్యామేజ్ చేస్తుంది. వర్షాకాలంలో హెయిర్ కలరింగ్, స్ట్రెయిటెనింగ్ వంటివి మానుకోండి. ఇవి జుట్టు రాలిపోయే అవకాశాలను రెట్టింపు చేస్తాయి.