
చికెన్ తినాలని ఎవరికీ ఉండదు చెప్పండి.. మార్కెట్‌లో పెరిగిన ధరలు చూసి అందరూ వామ్మో. వాయ్యో అనుకుంటూ .. కొద్దిగా తెచ్చుకుని దానితోనే సరిపెట్టుకుంటున్నారు. తక్కువ తెచ్చినా కూడా మీరు వర్రీ కాకండి.. మీ ఇంట్లో ఉండే వాటితోనే పావు కిలో చికెన్ ను 5 మందికి సరిపడేలా కూర చేసి ఫ్యామిలీ మొత్తానికి పెట్టొచ్చు. ఎలాగో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ముందుగా మీరు షాప్ నుంచి తెచ్చిన చికెన్‌ను తీసుకుని బాగా కడిగి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పట్టించి కొద్దీ సేపు పక్కన పెట్టుకోండి అలాగే దీనిలో కొద్దిగా కారం, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చెయ్యాలి. ఇంకా ఈ కూర ఎక్కువ చెయ్యడానికి బంగాళాదుంప ముక్కలు, నాలుగు పెద్ద టమాటాలు, ఉల్లిపాయలు వేసినా కూడా సరిపోతోంది .

ఇంకా దీనిలో దోసకాయ ముక్కలు, పచ్చి సెనగ పప్పు కూడా వేస్తే రుచి అదిరిపోతోంది. ఈ కూర మరింత టేస్టీగా అవుతుంది. అయితే, ఇంకా దీనిలో కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అలాగే నాలుగు బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి లు కూడా వేసి దీనిలో బాగా మగ్గించాలి. ఇవన్ని వేసి మూత పెడితే చికెన్ తో పాటు వీటి పరిమాణం కూడా పెరుగుతుంది

చికెన్లో ఒక వేళ మీరు బంగాళాదుంపలు వేస్తె మెత్తగా అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి అలాగే కూరకు మంచి గ్రేవీ కూడా పెరుగుతుంది. ఇంకా దీనిలో రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ కూడా వేస్తే కొద్దీగా ఉన్న కూర చాలా ఎక్కువగా కనపడుతుంది.అలాగే టేస్ట్ కూడా అదుర్స్ ఇంకా దీనిలో కొత్తిమీర వేస్తె ఇంకా అద్భుతం.

మట్టి పాత్రలో చేస్తే ఆ మట్టి వాసన చికెన్ కు తగిలి దాని రుచి కూడా పెరుగుతుంది అలాగే, వీటిలో మసాలా పొడి వేసుకుంటే హోటల్లో తిన్నంత ఫీల్ వస్తుంది. మీరు కూడా ఒకసారి పావు కిలో చికెన్ తెచ్చి ఇవన్ని కలిపితే.. అరకిలో కూర అవుతుంది ఎలాంటి లోటు లేకుండా మినిమం ఐదు మంది వరకు అందరికీ వడ్డించొచ్చు