
చికెన్ తినాలని అనిపించినా.. కొందరు మార్కెట్‌లో ధరలకు వామ్మో అనుకుంటూ .. కేవలం పావు కిలోనే తీసుకెళ్తుంటారు. అయితే, అస్సలు వర్రీ అవ్వకండి మీ ఇంటి కిచెన్ లో ఉండే కొన్ని పదార్థాలతో పావు కిలో కోడి ముక్కలతో అరకిలో కూర చేసి ఫ్యామిలీ మొత్తం తినేలా అదిరిపోయే టేస్ట్ వస్తుంది ఎంచక్కా అందరూ వీటిని తినొచ్చు.

ముందుగా చికెన్‌ను తీసుకుని దానిని బాగా కడిగి ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కూర మరి ఎక్కువగా రావాలంటే బంగాళాదుంప ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు వేస్తే సరిపోతోంది .

ఇంకొందరు బీరకాయ ముక్కలు కూడా వేస్తే చికెన్ టేస్ట్ కూడా పెరుగుతుంది ఇది కూరను మరింత టేస్టీగాఅయ్యేలా చేస్తుంది. అయితే, ముందుగా పాన్‌లో ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక కప్పు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించాలి. ఇప్పుడు చికెన్ వేసి మూత పెట్టాలి.

చికెన్ నుంచి నీరు బయటకు వచ్చాక ఈ బంగాళాదుంపలు వేసి మెత్తగా అయ్యే వారలు వీటిని బాగా ఉడికించాలి. ఈ కూరకు మంచి గ్రేవీ రావాలంటే ఇంకా దీనిలో కొబ్బరి పేస్ట్ కూడా వేసి కొద్దిగా కలపాలి. అప్పుడు కూర పరిమాణం కూడా ఈజీగా పెరుగుతుంది.. అలాగే టేస్ట్ కూడా సూపర్. చివర్లో కొత్తిమీర వేసి దించి తింటే అందరూ ఫుల్‌గా లాగించేస్తారు

బంగాళాదుంపలు: అయితే, బంగాళాదుంపలు ముక్కలుగా కట్ చేస్తే కోడి ముక్కల్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటే రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుంది. ఇంకా దీనిని మట్టి పాత్రలో వచ్చేసి వండితే విలేజ్ స్టైల్ రుచి ఉంటుంది. మీరు కూడా ఈ సారి ఇలా ట్రై చేయండి.