Mental Health: మీకెప్పుడైనా ఆకస్మికంగా భయం వేయడం జరిగిందా? గుండె వేగం పెరిగి నియంత్రణ కోల్పోతున్నారా?

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఆహారం, వ్యాయామం చాలా అవసరం. అయితే శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. మనస్సు ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పని ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు అన్నీ మనసుపై ఒత్తిడి తెస్తాయి. అలాగే ఏదైనా సంఘటన జరిగినా, చదివినా మనసులో అలజడి ఏర్పడుతుంది. అలాంటప్పుడు..

|

Updated on: Sep 12, 2024 | 12:41 PM

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఆహారం, వ్యాయామం చాలా అవసరం. అయితే శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. మనస్సు ఆరోగ్యం పదిలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అందుకు కొన్ని  జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పని ఒత్తిడి, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు అన్నీ మనసుపై ఒత్తిడి తెస్తాయి. అలాగే ఏదైనా సంఘటన జరిగినా, చదివినా మనసులో అలజడి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఏమి చేయాలో చాలా మందికి తెలియదు.

1 / 5
దీనిని పానిక్ అటాక్ లేదా యాంగ్జయిటీ అటాక్ అంటారు. ఇలాంటివి జరిగినప్పుడు అకస్మాత్తుగా భయం మొదలవుతుంది. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం కష్టమవుతుంది. ఛాతీ లోపలి భాగం మెలికలు తిరిగినట్లు అనిపిస్తుంది. మాటల్లో చెప్పలేని బాధ వెంటాడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి?

2 / 5
పానిక్ అటాక్ లేదా యాంగ్జయిటీ అటాక్ వస్తే ఐదు నిమిషాల మెడిటేషన్ చేస్తే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధ్యానంలో చుట్టూ వాతావరణాన్ని పూర్తిగా మర్చిపోవాలి. అందుకు నిశ్శబ్ద వాతావరణాన్ని ఎంచుకోవాలి. తక్కువ శబ్దం ఉన్న స్థలాన్ని ఎంచుకుని, పూర్తి నిశ్శబ్ద వాతావరణంలో ధ్యానం చేస్తే.. మనసులోని అలజడి దూరం అవుతుంది.

3 / 5
మీ ఫోన్‌లో 5-10 నిమిషాల టైమర్‌ని సెట్ చేసుకుని ధ్యానం చేయాలి.  మళ్లీ మళ్లీ కళ్లు తెరవకుండా కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నించండి. అవసరమైతే, తేలికపాటి సంగీతం లేదా ధ్యాన సంగీతాన్ని వినవచ్చు.

4 / 5
ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చుకోవాలి. ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాస మీద దృష్టి పెట్టాలి. ఇలా 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు మంత్రాలను కూడా జపించవచ్చు. హృదయ స్పందన సాధారణ స్థితికి వచ్చిందని, ఆందోళన తగ్గిందని మీకు అనిపించినప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. అప్పుడు ఒక గ్లాసు నీరు తాగితే నార్మల్‌ అవుతారు.

5 / 5
Follow us