మార్నింగ్‌ బనానా డైట్‌ గురించి తెలుసా.? ఆ సమస్యకి చెక్..

11 September 2024

Battula Prudvi 

కడుపులో యాసిడ్లు కారణం అధిక గ్యాస్ట్రిక్ సమస్యకు, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం మొదలైన సమస్యలకు దారితీస్తుంది.

ఈ సమస్య ఉన్నప్పుడు ఆహారం తినాలన్నా, ఏదైనా తాగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.దీనికి చెక్ పెట్టాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి.

అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆహారం సంపూర్ణంగా జీర్ణం కావడంలో సాయపడతాయి. కడుపులో ఆమ్లాల ఉత్పత్తి సమస్యను దూరం చేస్తుంది.

జీర్ణాశయంలో ఉన్న అదనపు ఆమ్లాలను తటస్థం చేయడంలో అరటిపండు చక్కగా పనిచేస్తుంది. తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గిస్తుంది.

ఓట్స్‎లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కడుపులో గ్యాస్ట్పోసోఫాగియల్ రిప్లక్స్ వ్యాధిని తగ్గించడంలోనూ ఓట్మోల్ ఇవి బాగా పనిచేస్తాయి.

పుచ్చకాయ, సీతాఫలం వంటి పండ్లు శరీరంలో యాసిడ్లు ఉత్పత్తి చేయడాన్ని, ఆమ్లతను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.

పాలకూర, బచ్చలికూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుకూరలు కూడా కడుపులో ఆమ్లాన్ని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

దోసకాయలో నీటి కంటెంట్ ఆమ్లతను చల్లబరుస్తుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో ఆమ్లాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

బ్రౌన్ రైస్, హోలో వీట్ బ్రెడ్ వంటి ఆహారాలు కాంప్లెక్స్ తో కూడిన కార్బోహైడ్రేట్లు కడుపులో ఆమ్ల సమస్యకు ఉపశనం ఇస్తాయి.