
కొందరు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తారు. మరి కొందరి జీవన విధానమే రికార్డుల్లా ఉంటుంది. చొక్కా అంటే అతనికి మహా చెడ్దా చిరాకు, చొక్కా వేసుకుంటే అదేదో జెర్రీలు పారుతున్నట్టు ఫీలవుతాడు. అందుకే యాభై ఏళ్లుగా అసలు చొక్కానే వేసుకోలేదు.జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కయ్య అనే అతనికి ఎన్నో ప్రత్యేకత లున్నాయి. అందుకే ఇతన్నీ అయిలాపూర్ వాసులు అందరు మరో మహాత్మా గాంధీ అని పిలుస్తారు. మరీ గ్రామస్తులకు అతను గాంధీ ఎలా అయ్యాడో తెలుసుకుందాం..

బక్కన్నకు చొక్కా వేసుకోవటం అంటే నచ్చదూ.. చిన్నప్పుడు వాళ్ల తల్లిదండ్రులు బక్కన్నకు చొక్కా వెయ్యలేదట..ఆర్థిక పరిస్థితులు ఓ కారణమైతే అదే అతనికి అలవాటుగా చేసుకున్నాడు. ఊహా తెలిసిన నుండి బక్కన్న చొక్క వేసుకోలేదు.. ఎన్నోసార్లు అతని అన్న ప్రాదేయపడినా వినలేదు. అదే సమయంలో బక్కన్నకు పెళ్లి కుదిరింది.. అప్పుడు కూడా చొక్క వేసుకోలేదు. వచ్చిన భార్య ఎంతగానో బ్రతిమిలాడి చొక్క వేసుకోవాలన్న భార్యను వదులుకోవడానికి వెనుకాడ లేదు కానీ బక్కన్న మాత్రం బట్టలు వేసుకోలేదు. ఇదేమిటని బక్కన్నను అడిగితే తనకు చొక్కా అంటే ఇష్టం ఉండదని వేసుకుంటే ఉండలేనని చెప్పాడు.

కట్టుకున్న ఎంత ప్రయత్నించినా బక్కన్న చొక్క వేసుకోలేదు. నేను కావాలంటే చొక్క వేసుకోవాలి లేకపోతే వెళ్లిపోతానని చెప్పినా భార్య వెళ్లిన పర్వాలేదు కానీ నేను మాత్రం చొక్క వేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో బట్టలు వేసుకోని అతని కాపురం చేయలేనని భార్య వదిలి వెళ్ళిపోయింది. చలికాలం.. వర్షకాలం.. ఎండాకాలం.. ఏ కాలమైనా అతని శరీరమే ఆయనకు వస్త్రం, అందుకే చొక్కా లేకుండానే అన్ని ప్రాంతాలకు వెళ్తాడు.

గతంలో వార్డు మెంబర్ గా పని చేసిన పక్కన ఇప్పటివరకు కూడా మీటింగ్ లకు, ఇతర ఏ కార్యక్రమాలు ఉన్న చుక్క లేకుండానే వెళ్తాడు, చొక్కా శరీరంపై వేసుకుంటే తనకు చెమటలు వస్తాయని అందుకే 50 ఏళ్లుగా చొక్కా వేసుకోలేదని చెప్తున్నాడు. బక్కన్న గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇతర గ్రామస్తులు కూడా అతన్ని గాంధీ అని పిలుస్తుంటారు.

భార్య పిల్లలు ఎవరు లేకపోవడంతో తన అన్న వద్ద ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎముకలు కొరికే చలిలోనైనా, శరీరం భగభగమండేఎండలోనైనా, ఎడతెరపని వర్షంలోనైనా అతను చొక్కా లేకుండానే ఉంటాడు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుండగా చలికి తట్టుకోలేక వెచ్చని దుంపట్లతో చలిని తప్పించుకుంటున్న ఈ సమయంలో కూడా బక్కన్న ఒంటిపై ఏది కప్పుకోకుండానే పడుకుంటాడు ఎక్కడికి వెళ్లిన ఇతన్ని చూసి అందరు ఆశ్చర్యపోతారు.