
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జోతిష్యశాస్త్రం ప్రకారం, కుజుడు త్వరలో రోహిణీ నక్షత్రంలో కి అడుగుపెట్టడం వలన వీరి జీవితాల్లో కొత్త మార్పులు తీసుకురాబోతున్నాడు. ఇంకా ఈ కారణంగా, రెండు రాశుల వారికి మేలు చేయబోతున్నాడు. ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారాల్లో కూడా అధిక లాభాలు వస్తాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

సింహ రాశి : ఈ రాశివారి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఇంకా వీళ్ళు కూడా ఊహించలేని అద్భుతాలు చూస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా అవసరం. ఇంకా మీరు చేసే ప్రయాణాల వల్ల జరగవు అని అనుకున్నవి కూడా జరుగుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడుల్లో ఆకస్మిక లాభాలు వస్తాయి. మీ ప్రియమైన ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. అలాగే, కొత్త పరిచయాలు వలన జీవితంలో మంచి జరుగుతుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ముందు ముందు అన్ని మంచి రోజులే. వీరికి అనుకూలంగా మారుతుంది. అలాగే, వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వారికీ బాగా కలిసి వస్తుంది. మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అన్నదమ్ముల మధ్య సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.