కుంభ రాశిలోకి కుజుడు.. లక్కూ, హ్యాపీనెస్.. ఈ రాశుల పంట పండినట్లే..!

Updated on: Feb 10, 2026 | 3:59 PM

Mars in Aquarius: ఫిబ్రవరి 23న శని అధిపత్యంలోని కుంభరాశిలోకి కుజుడు ప్రవేశించనున్నాడు. దాదాపు 18 నెలల తరువాత కుజుడు మళ్లీ కుంభరాశిలో అడుగుపెడుతున్నాడు. ఈ కుజ సంచారం కొన్ని రాశుల వారికి ఈ కాలంలో విశేషమైన శుభఫలితాలు దక్కనున్నాయి. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
జ్యోతిషశాస్త్రంలో కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది.  గ్రహాధిపతిగా భావించబడే కుజుడి ప్రతి సంచారం ద్వాదశ రాశుల వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతుందని నమ్మకం. ప్రస్తుతం కుజుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. సాధారణంగా కుజుడు ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు.

జ్యోతిషశాస్త్రంలో కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. గ్రహాధిపతిగా భావించబడే కుజుడి ప్రతి సంచారం ద్వాదశ రాశుల వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతుందని నమ్మకం. ప్రస్తుతం కుజుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. సాధారణంగా కుజుడు ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు.

2 / 5

ఈ క్రమంలో, ఫిబ్రవరి 23న శని అధిపత్యంలోని కుంభరాశిలోకి కుజుడు ప్రవేశించనున్నాడు. దాదాపు 18 నెలల తరువాత కుజుడు మళ్లీ కుంభరాశిలో అడుగుపెడుతున్నాడు. ఈ కుజ సంచారం మేషం నుంచి మీనం వరకు అన్ని 12 రాశులపై ప్రభావం చూపనుంది. అయితే, కొన్ని రాశుల వారికి ఈ కాలంలో విశేషమైన శుభఫలితాలు దక్కనున్నాయి. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క్రమంలో, ఫిబ్రవరి 23న శని అధిపత్యంలోని కుంభరాశిలోకి కుజుడు ప్రవేశించనున్నాడు. దాదాపు 18 నెలల తరువాత కుజుడు మళ్లీ కుంభరాశిలో అడుగుపెడుతున్నాడు. ఈ కుజ సంచారం మేషం నుంచి మీనం వరకు అన్ని 12 రాశులపై ప్రభావం చూపనుంది. అయితే, కొన్ని రాశుల వారికి ఈ కాలంలో విశేషమైన శుభఫలితాలు దక్కనున్నాయి. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5

వృషభ రాశి..

కుజుడు వృషభ రాశి వారికి 10వ ఇంటిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల వీరి జీవితంలో అనేక అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు లేదా జీతం పెరుగుదల జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, అనుకోని లాభాలు దక్కుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో ఉపశమనం కలుగుతుంది.

వృషభ రాశి.. కుజుడు వృషభ రాశి వారికి 10వ ఇంటిలోకి ప్రవేశించనున్నాడు. దీనివల్ల వీరి జీవితంలో అనేక అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు లేదా జీతం పెరుగుదల జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, అనుకోని లాభాలు దక్కుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో ఉపశమనం కలుగుతుంది.

4 / 5

మిథున రాశి.. 

కుజుడు మిథున రాశి వారి 9వ ఇంటిలో సంచరించనున్నాడు. దీని ప్రభావంతో అదృష్టం బలపడుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. విదేశీ ప్రయాణాల అవకాశాలు కలుగుతాయి. మీరు ప్రారంభించే ప్రతి పని విజయవంతంగా సాగుతుంది. వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి ఇది అనుకూల సమయం. కొత్త ఆలోచనలు, ప్రణాళికలు లాభాల దిశగా నడిపిస్తాయి. ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది.

మిథున రాశి.. కుజుడు మిథున రాశి వారి 9వ ఇంటిలో సంచరించనున్నాడు. దీని ప్రభావంతో అదృష్టం బలపడుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. విదేశీ ప్రయాణాల అవకాశాలు కలుగుతాయి. మీరు ప్రారంభించే ప్రతి పని విజయవంతంగా సాగుతుంది. వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి ఇది అనుకూల సమయం. కొత్త ఆలోచనలు, ప్రణాళికలు లాభాల దిశగా నడిపిస్తాయి. ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది.

5 / 5
కుంభ రాశి..

కుజుడు కుంభ రాశి వారి లగ్నంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగతంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పొందే అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం కనిపిస్తుంది. నూతన దాంపత్య జీవితం ప్రారంభించిన వారికి ఆనందం పెరుగుతుంది. వారసత్వ ఆస్తుల ద్వారా లాభం కలుగుతుంది. ఆరోగ్యం పరంగా కూడా మంచి మార్పులు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మొత్తంగా ఈ మూడు రాశులవారికి అనుకూల ఫలితాలు పొందనున్నారు. 

(Disclaimer : ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

కుంభ రాశి.. కుజుడు కుంభ రాశి వారి లగ్నంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగతంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పొందే అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం కనిపిస్తుంది. నూతన దాంపత్య జీవితం ప్రారంభించిన వారికి ఆనందం పెరుగుతుంది. వారసత్వ ఆస్తుల ద్వారా లాభం కలుగుతుంది. ఆరోగ్యం పరంగా కూడా మంచి మార్పులు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మొత్తంగా ఈ మూడు రాశులవారికి అనుకూల ఫలితాలు పొందనున్నారు. (Disclaimer : ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)