Makeup Remover: వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకున్నారా.. మేకప్ రిమూవర్‌గా బాదం నూనె బెస్ట్ ఎంపిక..

Updated on: Sep 25, 2023 | 1:21 PM

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కొందరు సహజంగా అందంగా ఉంటే మరికొందరు తమ అందాలను మేకప్ తో తీసుకుని వస్తారు. అందంగా కనిపించడానికి కొంతమంది మేకప్ ఆశ్రయిస్తారు.  గంట తరబడి ఓర్పుగా మేకప్ వేసుకుంటారు. అయితే ఓర్పుతో మేకప్‌ వేసుకున్నా ... ముఖానికి మేకప్ ఉంచుకుని నిద్రపోకూడదు. ప్రస్తుతం చాలా మంది వాటర్ ప్రూఫ్ మేకప్ వాడుతున్నారు. కనుక మేకప్ ను తొలగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

1 / 8
మేకప్ ను చాలా ఓపికతో చేసుకోవాలి. ఐలైనర్, లిప్ స్టిక్ ఇలా ప్రతి విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అందుకనే ఎక్కడికైనా వెళ్లే ముందు కనీసం 30 నిమిషాలు మేకప్‌ వేసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి.

2 / 8
కొందరు మేకప్ వేసుకోవడానికి గంటల సమయం తీసుకుంటారు. కానీ ఆ మేకప్ తీసుకోవడానికి అదే ఓర్పు చూపించరు. కొన్ని సార్లు ముఖానికి మేకప్ వేసుకుని నిద్రపోతారు కూడా.. 

3 / 8
మేకప్ చర్మంపై ఉంటే అది చర్మానికి నష్టాన్ని కలిగిస్తుంది. హానిని కలిగిస్తుంది. మొటిమలు, దద్దుర్లు వంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖం నుంచి మేకప్ శుభ్రం చేసుకోవడం ముఖ్యం.

4 / 8
ప్రస్తుతం చాలా మంది వాటర్ ప్రూఫ్ మేకప్ వాడుతున్నారు. ఈ మేకప్ ను తొలగించడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మేకప్‌ను తొలగించడానికి మార్కెట్‌లో మైకెల్లార్ వాటర్ అందుబాటులో ఉన్నప్పటికీ. పెట్రోలియం జెల్, క్రీమ్‌తో మేకప్ రిమూవర్ గా పనిచేస్తాయి. 

5 / 8
మేకప్ రిమూవర్ అందుబాటులో లేకుంటే..  మీరు బాదం నూనె సహాయం తీసుకోవచ్చు. బాదం నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. మేకప్ తొలగించడమే కాకుండా, ఈ నూనె చర్మానికి బహుళ ప్రయోజనాలను అందిస్తుంది.

6 / 8
మైకెల్లార్ నీటితో మేకప్ తొలగించడం వల్ల చర్మం పొడిబారుతుంది. కానీ బాదం నూనె చర్మం తేమను తీసివేయదు. బదులుగా, ఇది మీ చర్మాన్ని మేకప్ వల్ల కలిగే హాని నుండి రక్షిస్తుంది.

7 / 8
అది వాటర్‌ప్రూఫ్ మాస్కరా లేదా లిప్‌స్టిక్ అయినా, బాదం నూనె ప్రతిదీ శుభ్రపరుస్తుంది. కొన్ని చుక్కల బాదం నూనె వేసి చర్మంపై బాగా మసాజ్ చేయండి. తర్వాత తడి టిష్యూతో ముఖాన్ని తుడవండి.

8 / 8
బాదం నూనెతో మేకప్ తొలగించిన తర్వాత కూడా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బాదం నూనెతో మేకప్ తొలగించిన తర్వాత నురుగుతో కూడిన ఫేస్ వాష్ ఉపయోగించి మీ ముఖాన్ని కడగాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.