మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో అద్భుత దృశ్యం.. సాయంత్రం కాగానే వందలాది రామచిలుకల సందడి!

Edited By:

Updated on: Nov 20, 2026 | 4:03 PM

నిత్యం బస్సుల రాకపోకలు.. ప్రయాణికుల హడావుడి.. వాహనాల రణగొణ ధ్వనులు.. ఇదీ సాధారణంగా బస్టాండ్‌లో కనిపించే దృశ్యం. కానీ మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో మాత్రం సాయంత్రం అయ్యిందంటే చాలు వీటన్నింటికీ భిన్నంగా ఓ అందమైన ప్రకృతి దృశ్యం కనిపిస్తుంది. వందలాది రామచిలుకలు ఒకేచోట చేరి చేసే సందడి చూపరులను కట్టిపడేస్తోంది. పచ్చని చెట్లపై ఆకు పచ్చని చిలుకల కొలువు. వాటి కిలకిలరావాలతో బస్టాండ్ ఆవరణే ఓ పక్షుల విడిదిగా మారిపోయింది

1 / 5
నిత్యం బస్సుల రాకపోకలు.. ప్రయాణికుల హడావుడి.. వాహనాల రణగొణ ధ్వనులు.. ఇదీ సాధారణంగా బస్టాండ్‌లో కనిపించే దృశ్యం. కానీ మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో మాత్రం సాయంత్రం అయ్యిందంటే చాలు వీటన్నింటికీ భిన్నంగా ఓ అందమైన ప్రకృతి దృశ్యం కనిపిస్తుంది. వందలాది రామచిలుకలు ఒకేచోట చేరి చేసే సందడి చూపరులను కట్టిపడేస్తోంది. పచ్చని చెట్లపై ఆకు పచ్చని చిలుకల కొలువు. వాటి కిలకిలరావాలతో బస్టాండ్ ఆవరణే ఓ పక్షుల విడిదిగా మారిపోయింది.

2 / 5
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వందలాది రామచిలుకలకు చిరునామాగా మారింది. ఇక్కడి భారీ వృక్షాలే వాటికి ఆవాసాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రావి చెట్లపై గుంపులు గుంపులుగా వాలే చిలుకలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. చెట్ల ఆకుల మధ్య పచ్చని రంగులో కలిసిపోయే ఈ పక్షులు ఒక్కసారిగా ఎగిరితే ఆ దృశ్యం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రామచిలుకలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం కోసం సమీప ప్రాంతాల్లో విహరిస్తుంటాయి.

3 / 5
సూర్యుడు అస్తమించే వేళ తమ ఆవాసాలకు తిరుగు ప్రయాణం మొదలుపెడతాయి. ఒక్కొక్కటిగా కాకుండా గుంపులు గుంపులుగా బస్టాండ్ ఆవరణలో వచ్చి చెట్లపై వాలుతాయి. కొద్దిసేపటికే చెట్లన్నీ రామచిలుకలతో నిండిపోతాయి. వాటి కిలకిలరావాలతో పరిసర ప్రాంతమంతా సందడిగా మారిపోతుంది. చెట్ల కొమ్మలపై ఒకదానికొకటి దగ్గరగా చేరుతూ.. అటూ ఇటూ కదులుతూ.. రెక్కలు విప్పి ఎగురుతూ చేసే హడావుడి చూడముచ్చటగా ఉంటుంది. కొన్ని చిలుకలు కొమ్మలపై కూర్చుని సేదతీరుతుంటే.. మరికొన్ని ఆకాశంలో చక్కర్లు కొడుతుంటాయి.

4 / 5

 వందలాది పక్షులు ఒకేచోట చేరి చేసే ఈ సందడి చూపరులకు మధురానుభూతి మిగుల్చుతుంది. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులకు ఈ రామచిలుకల సందడి ఓ ప్రత్యేక ఆకర్షణగా మారింది. బస్సుల కోసం ఎదురుచూసే వారు సైతం మొబైల్ ఫోన్లలో ఈ అందమైన దృశ్యాలను బంధిస్తున్నారు. స్థానికులు కూడా ప్రతిరోజూ సాయంత్రం వేళ ఈ పక్షుల రాకను ఆసక్తిగా తిలకిస్తున్నారు. పట్టణ జీవనంలో ప్రకృతి అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం ఇక్కడ కనిపిస్తోంది.

5 / 5
మారుతున్న కాలంలో పట్టణీకరణ పెరుగుతూ.. పచ్చదనం తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో మహబూబ్‌నగర్ బస్టాండ్‌లోని భారీ వృక్షాలు ఇన్నేళ్లుగా వందలాది పక్షులకు ఆశ్రయమిస్తున్నాయి. ప్రకృతిని కాపాడుకుంటేనే ఇలాంటి అందమైన దృశ్యాలను భావితరాలకు అందించగలమనే సందేశాన్ని ఈ చిలకల గుంపు ఇస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us