
దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో అందరూ వాటికి ప్రత్యమ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లను కొంటున్నారు.దీంతో మార్కెట్‌లో వాటి స్టాక్ మొత్తం అయిపోయింది. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి ఎలక్ట్రిక్ స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్ ఓ మంచి ఎంపిక దీనిలో మీరు గ్యాస్ లేకుండానే వంట చేసుకోవచ్చు. దీనిలో దాదాపు 33 రకాల వంటలను చేసుకోవచ్చు.

ఎయిర్‌ప్రైయర్‌లో ఏ వంటకాలు చేసుకోవచ్చు: ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ ప్రైయర్‌లో మీరు 33 రకాల వంటలను చేసుకోవచ్చు. వాటిలో త్వరగా వేయించే వంటలు, నీటిలో ఉడికించే వంటలు, ఆవిరితో వంట, కేకులు, బేకింగ్ వంటలు ఇలా ఇంకా అనేక రకాల వంటలు చేసేందు ఇందులో సపరేట్ మోడ్స్ ఉన్నాయి. ఇలా రోజువారీ వంటల నుండి ప్రత్యేక వంటకాల అన్నింటిని దీనిలో క్షణాల్లో వండుకోవచ్చు.

ఈ స్మార్ట్ కుక్కర్‌లో అంబిట్ హీట్ అనే ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగించారు. దీనిలో ఉండే సెన్సర్లు వంట సమయంలో ఉష్ణోగ్రతను ఆటోమేటిక్‌గా నియంత్రిస్తాయి. దీని వల్ల కూరగాయలు సరిగ్గా ఉడుకుతాయి. అలాగే రుచి, టెక్స్చర్ కూడా సూపర్‌గా వస్తుంది. మీకు వంట చేయడంలో ఎలాంటి అనుభవం లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు.

ఈ కుక్కర్ మీకు 6 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. దీని ద్వారా మీరు ఒకేసారి ఐదు మందికి సరిపడే భోజనం తయారు చేయవచ్చు. ఇది ముఖ్యంగా చిన్న కుటుంబాలకు, బ్యాచులర్స్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో స్లీక్ మ్యాట్ ఫినిష్ డిజైన్ ఉంటుంది. ఇది మీ వంటగదికి మంచి స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది.

ప్రస్తుతం నెలకొన్ని గ్యాస్ కొరత కారణంగా సిలిండర్ దొరకడం చాలా ఇబ్బందిగా మారింది. ఇలాంటి సందర్భాల్లో ఈ కుక్కర్ మీకు చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే దీంతో గ్యాస్ అవసరం లేకుండా విద్యుత్‌లోనే వంట చేయవచ్చు. ఇది ప్రస్తుతం అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ లేదా బయట షాప్‌లో ఈజీగా దొరకుతుంది.