మిగిలిపోయిన అన్నాన్ని ఇలా పెడితే మీ జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది..! ట్రై చేయండి..

|

Nov 07, 2024 | 4:56 PM

ప్రతి అమ్మాయి తన జుట్టు అందంగా, ఒత్తుగా, పొడవుగా ఉండాలని కోరుకుంటుంది. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు వివిధ రకాల నూనెలు, షాంపూలను ఉపయోగిస్తారు. కానీ, కెమికల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. వెంట్రుకలు పొడిబారుతుంటాయి. కాబట్టి జుట్టు సంరక్షణకు సహజసిద్ధమైన పద్ధతులను అనుసరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కేశ సంరక్షణలో రాత్రి మిగిలి అన్నం కూడా అద్భుతంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి పూట మిగిలిపోయిన అన్నం జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.. జుట్టు పోషణకు చద్దన్నం చాలా మేలు చేస్తుంది. అన్నం వాడకంతో మీ జుట్టు పొడవుగా, ఒత్తుగా, దృఢంగా పెరుగుతుందని చెబుతున్నారు. జుట్టుకు అన్నాన్ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.

2 / 5
ఒక పెద్ద గిన్నెలో ఒక కప్పు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తీసుకోవాలి. అలాగే, రెండు స్పూన్ల మెంతులు కూడా తీసుకోవాలి. బీట్ రూట్ రసం, తాజా అలోవెరా జెల్ తీసుకోండి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. నానబెట్టిన మెంతులు, అన్నంతో కలిపి మెత్తని పేస్ట్‌గా తయారు చేసుకోవాలి. అందులో బీట్ రూట్ జ్యూస్, అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి.

3 / 5
కొబ్బరి నూనెలో కూడా ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో జీవక్రియను వేగవంతం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. కొబ్బరి నూనె తలపై తేమను నిలిపి ఉంచి, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు తలలో చికాకును తగ్గించి, స్కాల్ప్‌కు మంచి రిలీఫ్ కలిగిస్తాయి.

4 / 5
ఉసిరి, కొబ్బరి నూనె రెండూ జుట్టు రాలడాన్ని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఉసిరి పొడి జుట్టు మూలాలను బలపరుస్తుంది.. జుట్టు నెరసిపోవడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె తలకు పోషణనిస్తుంది. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఉసిరి,కొబ్బరి నూనె తలకు తేమను అందిస్తాయి..పొడిబారిన, చుండ్రుసమస్య నుండి రక్షిస్తుంది. ఇది తలలో వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది. ఈ ప్యాక్‌ను క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే మీ జుట్టు దృఢంగా మారి, నిగనిగలాడుతుంది.

5 / 5
మరో పద్ధతిలో పావుకప్పు వండిన అన్నం తీసుకోండి. దానికి పావు కప్పు ఫ్లాక్స్ సీడ్ జెల్ యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్ జెల్ లేకపోతే, బదులుగా అలోవెరా జెల్ ఉపయోగించవచ్చు. అందులో 1/2 స్పూన్ నల్ల నువ్వుల నూనె కలపాలి. కొన్ని చుక్కల రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ గ్రైండర్‌లో రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ ను స్కాల్ప్, హెయిర్ పై అప్లై చేయండి. 30 నిమిషాలు ఆరిన తరువాత వాష్‌ చేసుకోవాలి. తరువాత మీ జుట్టును హెర్బల్ షాంపూతో కడగాలి. ఇది మీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఈ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు మునుపటి కంటే చాలా మృదువుగా ఉంటుంది. క్రమంగా జుట్టు కోల్పోయిన షైన్ తిరిగి వస్తుంది. మీరు ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు.