
కివీ పండు అనేది చిన్నగా కనిపించినా, దానిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. విటమిన్ సి, ఈ, పొటాషియం, కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండిన ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. కివి పండులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో మంచిగా కేలరీలతోపాటు.. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, డైటరీ ఫైబర్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం ఉంటాయి.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..

డెంగ్యూ రోగులకు కివీ పండు చాలా ప్రయోజనకరం. ఇది రక్తంలో ప్లేట్లెట్స్ను వేగంగా పెంచుతుంది. అలాగే, దీనిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, కడుపు సంబంధిత సమస్యలైన గ్యాస్, ఆమ్లత్వం నుంచి ఉపశమనం అందిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కివీ ఒక మంచి ఎంపిక, ఎందుకంటే ఇందులో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉంటాయి.

కివీ పండు రోగనిరోధక శక్తిని పెంపొందించి, కాలానుగుణ వ్యాధుల బారి నుంచి రక్షిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలకు ఫోలేట్, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఐరన్ లోపాన్ని నివారిస్తుంది.

ఉబ్బసం (ఆస్తమా) రోగులకు కూడా కివీ చాలా మేలు చేస్తుంది, శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండెపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించడంలో కివీ గణనీయమైన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో కివీని చేర్చుకోవడం ద్వారా పూర్తి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

ఈ పండును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.