Summer Tips: అవి ఇవి వద్దు.. సమ్మర్‌లో రోజూ ఈ రొట్టెలు తిన్నారంటే.. తలపై తడిగుడ్డేసుకున్నట్టే!

Updated on: Apr 05, 2026 | 5:03 PM

Best Roti for Summer: ఈ రోజులు మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది అనేక రకాల వ్యాధుల భారీన పడుతున్నారు. అందులో ముఖ్యంగా అధికబరువు, షుగర్, బీపీతో చాలా మంది సతమతమవుతున్నారు. అందుకే వీరు రైస్‌ తినడం తగ్గించి ఆరోగ్యకరమైన రొట్టెలను తినేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఒక్కో రకం పిండి రొట్టెలు ఒక్కో ప్రయోజనాన్ని అందిస్తాయి. అన్ని రకాల పిండితో చేసే రొట్టెలు అన్ని కాలాలకు సరిపడవు. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే, తేలికగా అరిగే పిండిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి సమ్మర్‌లో ఏ రొట్టెలు తినడం మంచిదో తెలుసుకుందాం

1 / 6
జొన్న రొట్టె: వేసవి తినేందుకు జొన్న రొట్టే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని చల్లబరుస్తాయి. ఇది గ్లూటెన్-రహితం, కాబట్టి గోధుమలు తినడం వల్ల కడుపు బరువుగా లేదా గ్యాస్‌తో బాధపడేవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. జొన్నలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇది తేలికగా జీర్ణం అవుతుంది.కాబట్టి ఇది మధ్యాహ్న భోజనానికి మంచి ఎంపిక.

2 / 6
బియ్యం పిండి రొట్టె: బియ్యం పిండితో చేసే రొట్టెలు వేసవికి చాలా మంచివి. దీనికి శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంది. ఇది చాలా తేలికగా అరుగుతుంది.అందుకే సమ్మర్‌ ఈరొట్టె తినడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, కాబట్టి అతిగా తినకుండా నియంత్రిస్తుంది.

3 / 6
బార్లీ రొట్టె: వేసవిలో బాడీ టెంపరేచర్‌ను బ్యాలెన్స్ చేయడానికి బార్లీ పిండి రొట్టె అద్భుతంగా పనిచేస్తుంది. దీని చలువ చేసే గుణం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఇందులో అధిక ఫైబర్ ఉండటం వల్ల ఉక్కపోత వల్ల కలిగే గ్యాస్, కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.

4 / 6
రాగి పిండి రొట్టె: రాగి రొట్టెలు అత్యంత పోషకమైనవి. వీటిని లంచ్ లేదా డిన్నర్‌లో తీసుకోవచ్చు.ఇందులో క్యాల్షియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని ఇస్తూనే తేలికగా ఉంచుతుంది. వీటిని పల్చని కూరలు లేదా కొబ్బరి చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది.

5 / 6
గోధుమ రొట్టె: మనం రోజూ తినే సాధారణ రొట్టె ఇది. వేసవిలో దీనిపై కొద్దిగా నెయ్యి రాసుకుంటే త్వరగా అరుగుతుంది. వేసవిలో గోధుమ రొట్టెలను ఆనపకాయ, బీరకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవడం చాలా లాభదాయకం.

6 / 6
మల్టీగ్రెయిన్ రొట్టె: దీన్ని గోధుమలు, జొన్నలు, రాగులు, శనగపిండి కలిపి చేస్తారు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. పిండి కలిపేటప్పుడు అందులో తురిమిన సొరకాయ లేదా దోసకాయ వేస్తే రొట్టెలు మరింత ఆరోగ్యకరంగా మెత్తగా ఉంటాయి. వేసవిలో ఏ రకమైన రొట్టె తిన్నా, దానితో పాటు తగినంత పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. శరీరం చల్లగా ఉంటుంది.

Follow Us