పాతకాలంనాటి కమ్మటి అసలు సిసలైన జొన్న దిబ్బరొట్టె .. ఎలా చేయాలంటే?

Updated on: Mar 29, 2026 | 11:27 PM

ఇప్పుడు చెప్పబోయే రెసిపీ ఆంధ్రాలో చాలా ఫేమస్. ఎందుకంటే, ఇది వరకు రోజుల్లో ఈ రొట్టెలను చాలా బాగా తినే వాళ్ళు. ఆ వంటకం మరేదో కాదు.. జొన్న దిబ్బ రొట్టె. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రుచిగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
కావాల్సిన పదార్దాలు :  ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు బియ్యం రవ్వ, ఒక కప్పు పెరుగు,  రెండు చిన్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్లు నూనె, కొత్తిమీరను తీసుకోవాలి

2 / 5
ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు జొన్న పిండి, ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి వాటిని బాగా కలపాలి. ఇంకా దీనిలో ఒక గ్లాస్ నీరు పోసి జోరుగా కలుపుకోవాలి.

3 / 5
ఇక ఆ తర్వాత దానిలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

4 / 5
ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి దానికి మీద కొద్దిగా ఆయిల్ వేసి, అది వేడయ్యకా నూనె వేసి వేడి  వాటిని బాగా వేడి చేయాలి.  ఇప్పుడు మిశ్రమాన్ని పెనం మీద పోసి మందంగా చేసుకోవాలి . మూత పెట్టి మీడియం మంట పై 15  నిమిషాల పాటు బాగా కాల్చాలి.

5 / 5
ఈ దిబ్బ రొట్టెను ఒక వైపు కాల్చిన తర్వాత ఇంకో వైపు కూడా  బాగా కాల్చుకోవాలి. ఇలా వేసుకున్న రొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకుని తినడమే.

Follow Us