Cow Curd: ఆవు పెరుగు తినడం మంచిదేనా.. నిపుణులు ఏం అంటున్నారంటే..

|

Dec 29, 2024 | 2:50 PM

గెదే పెరుగుతో పాటు ఆవు పెరుగు కూడా మనకు లభిస్తుంది. కానీ ఎక్కువగా చాలా మంది గెదే పాలతో తయారు చేసిన పెరుగును ఉపయోగిస్తూ ఉంటారు. ఆవు పెరుగు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి..

1 / 5
పెరుగు అంటే కేవలం గేదెతో చేసిన పెరుగు అంటేనే అందరికీ తెలుసు. కానీ ఆవు పాలతో కూడా పెరుగు చేసుకోవచ్చు. కొద్దిగా రుచిలో మార్పులు ఉంటుంది. ఆవు పెరుగు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కూడా ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి.

2 / 5
రోజు వారి ఆహారంతో పాటు ఆవు పెరుగును తీసుకోవచ్చు. ఆవు పెరుగు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పెరుగు తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

3 / 5
రక్త పోటును కూడా కంట్రోల్ చేయడం ఆవు పెరుగు హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా పెరుగు చర్మాన్ని మృదువుగా, ప్రకాశ వంతంగా చేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయ పడుతుంది. ఇమ్యూనిటీ మెండుగా ఉంటే త్వరగా జబ్బుల బారిన పడకుండా ఉంటారు.

4 / 5
ఆవు పెరుగు త్వరగా జీర్ణం కూడా అవుతుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. ఈ పెరుగులో క్యాల్షియం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి కండరాలు, ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

5 / 5
బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినకూడదు. ఇందులో కొవ్వు శాతం ఎక్కువ. స్కిమ్డ్ మిల్క్‌తో తయారైన పెరుగు తినడం మంచిది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించే వారు స్కిమ్డ్ మిల్క్‌తో చేసిన పెరుగు తీసుకోవాలి. ఇలా పెరుగు తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.