ఏసీ రిమోట్‌లో ఈ సీక్రెట్ బటన్ గురించి తెలుసా..? వర్షాకాలంలో ఇది ఆన్ చేస్తే చాలు ఆ సమస్య ఉండదు..

Updated on: Jul 18, 2026 | 8:11 PM

AC Tips: వర్షాకాలం ఎండల వేడి నుండి ఉపశమనం కలిగించినప్పటికీ, తనతో పాటు గాలిలో విపరీతమైన తేమను మోసుకొస్తుంది. ఈ రోజుల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా.. గాలిలోని తేమ వల్ల ఇల్లు ఉక్కపోతగా, శరీరం జిగటగా అనిపిస్తుంది. అంతేకాకుండా గదిలో ఒక రకమైన వింత దుర్వాసన కూడా వస్తుంది. ఇలాంటి సమయంలో గదిలోని తేమను తొలగించి, వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చడంలో ఏసీ కీలక పాత్ర పోషిస్తుంది. వర్షాకాలంలో ఏసీని సాధారణ రోజుల్లా కాకుండా కొన్ని ప్రత్యేక సెట్టింగ్స్‌తో వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5
డ్రై మోడ్ ఆన్ చేయండి: చాలా మందికి ఏసీ రిమోట్‌లో ఉండే డ్రై మోడ్ గురించి అవగాహన ఉండదు. వర్షాకాలం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మోడ్ ఇది. ఈ మోడ్‌ను ఆన్ చేసినప్పుడు, ఏసీ గదిని మరీ ఎక్కువగా చల్లబరచకుండా గాలిలో ఉన్న అదనపు తేమను సమర్థవంతంగా గుంజేస్తుంది. దీనివల్ల గది పొడిగా మారడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది.

2 / 5
ఉష్ణోగ్రత 24 నుండి 26 డిగ్రీల మధ్యే ఉంచండి: వర్షాలు పడేటప్పుడు వాతావరణం అప్పటికే చల్లగా ఉంటుంది కాబట్టి ఏసీని 16 లేదా 18 డిగ్రీల వంటి అతి తక్కువ ఉష్ణోగ్రతలో అస్సలు ఉంచకూడదు. దానికి బదులుగా ఉష్ణోగ్రతను 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య సెట్ చేసుకోవాలి. ఈ టెంపరేచర్ వద్ద ఏసీ కంప్రెసర్ సజావుగా నడుస్తూ గదిని కంఫర్టబుల్‌గా ఉంచుతుంది మరియు గాలిలోని తేమను సులభంగా తొలగిస్తుంది.

3 / 5
ఫ్యాన్ స్పీడ్ తక్కువగా ఉంచండి: వర్షాకాలంలో ఏసీ ఫ్యాన్ స్పీడ్‌ను ఎప్పుడూ ఆటో లేదా లో సెట్టింగ్‌లో ఉంచడం మంచిది. ఫ్యాన్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు, గదిలోని గాలి ఏసీ కాయిల్స్ గుండా నెమ్మదిగా ప్రవహిస్తుంది. దీనివల్ల గాలిలోని తేమ కాయిల్స్‌పై నీటి బిందువులుగా మారి, డ్రైనేజీ పైపు ద్వారా బయటకు వెళ్లిపోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. ఫలితంగా గదిలో జిగట దనం త్వరగా తగ్గుతుంది.

4 / 5
ఏసీ ఫిల్టర్ల క్లీనింగ్: వర్షాకాలంలో గాలిలో ఉండే తేమ కారణంగా ఏసీ ఫిల్టర్లపై దుమ్ము, ధూళి త్వరగా పేరుకుపోయి గట్టిగా మారుతాయి. ఇలాంటి మురికి ఫిల్టర్లు గాలి ప్రవాహాన్ని అడ్డుకోవడమే కాకుండా తేమను తొలగించే ఏసీ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు వీటివల్ల గదిలో ఫంగస్ చేరి ఒక రకమైన బూజు వాసన వస్తుంది. అందుకే వారానికి లేదా పది రోజులకు ఒకసారి ఫిల్టర్లను తీసి శుభ్రం చేయడం తప్పనిసరి.

5 / 5
డ్రైనేజీ పైపును తనిఖీ చేయండి: గదిలో నుండి ఏసీ గుంజేసిన తేమ అంతా డ్రైనేజీ పైపు ద్వారా నీళ్ల రూపంలో బయటకు వెళ్తుంది. వర్షాకాలంలో ఈ పైపులో నాచు లేదా దుమ్ము అడ్డుపడితే, ఆ నీరంతా తిరిగి ఏసీ లోపలే ఉండిపోయి గదిలో తేమను, బ్యాక్టీరియాను పెంచుతుంది. కాబట్టి వాటర్ డ్రైనేజీ పైపు క్లియర్‌గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి.

Follow Us