
వంటగది సింక్‌లో నీరు నిలిచిపోవడం అనేది చాలా విసుగు కలిగించే సమస్య. ఇది రోజువారీ పనులను పూర్తిగా ఆపేస్తుంది. గిన్నెలు కడిగిన తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలు, నూనె జిడ్డు పైపులో పేరుకుపోయి రంధ్రాన్ని పూర్తిగా మూసివేస్తాయి. దీనివల్ల నీరు నిలిచిపోవడమే కాకుండా, వంటగది అంతటా దుర్వాసన వస్తుంది. దీని వల్ల ఇంట్లోని వారికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ బ్లాకేజ్ పోగొట్టడానికి చాలా మంది మార్కెట్లో దొరికే అనేక రకాల రసాయనాలు లేదా డ్రెయిన్ క్లీనర్లను వాడుతుంటారు. ఇవి పైపులను పాడు చేస్తాయి కానీ వీటితో పెద్దగా పూజ్ ఉండు. కానీ మీ వంటగదిలోనే ఈ సమస్యను చిటికెలో పరిష్కరించే ఒక మ్యాజిక్ పదార్థం ఉందని మీకు తెలుసా? అవును కిచెన్‌లో దొరికే బేకింగ్ సొడాను ఉపయోగించి మీరు క్షణాల్లో బాక్ అయిన సింక్‌ను ఈజీగా క్లిన్ చేయవచ్చు. అదెలానో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

శాస్త్రీయంగా బేకింగ్ సోడా అనేది జిడ్డు పదార్థాలను, వ్యర్థాలను చాలా వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. కాబట్టి మొదట సింక్‌లో పేరుకుపోయిన నీటిని మొత్తం తొలగించి. సింక్ మూతను తడి లేకుండా ఆరబెట్టండి. తర్వాత సింక్ రంధ్రంలో బేకింగ్ సోడాను బాగా వేయండి. సోడా నేరుగా పైపు లోపలికి వెళ్లేలా చూడండి, చుట్టుపక్కల గోడలకు అంటుకోకూడదు. ఆ తర్వాత సోడా పైపు లోపల స్థిరపడటానికి కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి.

ఇప్పుడు కొన్ని వేడి నీటిని తీసుకొని సింక్ పైపులో పోయండి. వేడి నీళ్లు పోసిన వెంటనే పైపులోని జ్యామ్ పూర్తిగా వదిలిపోయి, నీరు వేగంగా కిందకు వెలుతుంది. ఈ పద్ధతి పర్యావరణానికి సురక్షితమైనది, వంటగది పైపుల మన్నికను పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ సింక్ సరికొత్తదానిలా మారుతుంది.

వారానికి ఒకసారైనా పైపు రంధ్రంలో బేకింగ్ సోడా, వేడి నీళ్లు పోసే అలవాటు చేసుకోండి. గిన్నెలు కడిగేటప్పుడు అదనపు నూనె లేదా మిగిలిపోయిన ఆహార పదార్థాలను నేరుగా సింక్‌లో పడేయకండి. సింక్ రంధ్రంపై ఒక చిన్న జల్లెడ వాడితే పెద్ద మురికి పదార్థాలు అక్కడే ఆగిపోతాయి, దీనివల్ల పైపు ఎప్పటికీ బ్లాక్ అవ్వదు. కాబట్టి ఇంట్లో గిన్నెలు కడిగేప్పుడు దీన్ని గుర్తించుకోండి.