ఫ్రిజ్‌లో కాదు.. టమాటాలు ఎన్ని రోజులైన ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

Updated on: Oct 30, 2026 | 6:10 PM

నిత్యజీవితంలో వంటింట్లో ఏ కూర వండాలన్న టమాటా కంపల్సరీ. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలనే ఉద్దేశంతో చాలామంది వాటిని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. అయితే టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల వాటి అసలైన ప్రయోజనాలే గల్లంతవుతాయని ఆహార నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. టమాటాలను ఎలా నిల్వచేస్తే మంచిది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
ఫ్రిజ్‌లోని అధిక చల్లదనం టమాటాలోని అంతర్గత కణజాలాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఉష్ణోగ్రత బాగా పడిపోవడం వల్ల టమాటా తొక్క లోపలి కణాలు చిట్లిపోయి, అవి క్రమంగా పిండిపిండిగా, ముద్దగా మారిపోతాయి. తాజా టమాటాకు ఉండే కరకరలాడే గుణం, సహజ ఆకృతి ఈ చల్లదనానికి శాశ్వతంగా దూరమవుతాయి.

2 / 5
కేవలం ఆకృతి మాత్రమే కాదు, టమాటాలకు ప్రత్యేకమైన కమ్మటి రుచి, సువాసనను అందించే ఎంజైమ్‌లు చల్లని వాతావరణంలో పూర్తిగా పనిచేయడం ఆగిపోతాయి. రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన టమాటాలలో సహజ సువాసన అణువులు, ముఖ్యమైన పోషకాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా కూరల్లో వేసినా సరైన పులుపు, తాజాదనం రాకపోగా రుచిలేని చప్పదనం మాత్రమే మిగులుతుంది.

3 / 5
టమాటాలను తాజాగా, రుచి తగ్గకుండా నిల్వ చేసుకోవడానికి గది ఉష్ణోగ్రతే అత్యుత్తమ మార్గం. ప్రత్యక్ష సూర్యరశ్మి నేరుగా పడని విధంగా, గాలి బాగా ఆడే వంటగది అల్మారాలు లేదా కౌంటర్‌పై వీటిని ఉంచాలి. గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే టమోటా తన సహజ పరిపక్వతను పొందుతూ అద్భుతమైన రంగు, పోషకాలను సమకూర్చుకుంటుంది.

4 / 5
నిల్వ చేసే విధానంలో కూడా కొన్ని మెలకువలు పాటించడం ఎంతో ముఖ్యం. టమాటాలను బుట్టలో ఒకదానిపై ఒకటి గుట్టగా పేర్చకుండా విడివిడిగా పరచాలి. ముఖ్యంగా వాటి కాడలుపైకి ఉండేలా అమర్చితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. కాడ భాగం నుంచి గాలి లీక్ అవ్వకుండా, తేమ నిలిచి ఉండటం వల్ల అవి త్వరగా కుళ్లిపోకుండా తాజాగా ఉంటాయి.

5 / 5
చాలామంది మార్కెట్ నుంచి తేగానే టమాటాలను నీళ్లతో కడిగి అలాగే తడిగా నిల్వ చేస్తుంటారు. తేమ ఉన్న వాతావరణంలో బ్యాక్టీరియా, బూజు చాలా వేగంగా వ్యాపించి టమాటాలు త్వరగా కుళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వంటకు ఉపయోగించే ముందు మాత్రమే టమోటాలను కడగాలని, అప్పటివరకు పొడి వాతావరణంలోనే ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us