
కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు దొండకాయ ముక్కలు, 4 టమాటాలు, 100 గ్రాములు పచ్చిమిర్చి, నిమ్మకాయంత చింతపండు, 4 వెల్లుల్లి , ఒక కప్పు పల్లీలు, ఉప్పు, పసుపు, తాలింపు గింజలు, ఎండు మిర్చి, కొత్తిమీర, నూనెను తీసుకోవాలి.

ముందుగా స్టవ్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి అది వేడయ్యాక దొండకాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, టమాటోలు వేసి అవి మెత్తగా అయ్యే వరకువరకు బాగా వేయించాలి.

వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని రోటిలో ఒక్కోటిగా వేసి దంచుకుంటూ వాటిలో కొద్దిగా చింతపండు, మీరు తినేదానిని బట్టి ఉప్పు వేసి, అలాగే వీటిలో పల్లీలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి రోట్లో మెత్తగా రుబ్బుకోవాలి.

ఇలా రుబ్బిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పోపు పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకోసారి పాన్ పెట్టి తాలింపు గింజలు, కరివేపాకు ఆకులు , ఎండుమిర్చి , కొత్తిమీర వేసి దీనిలో బాగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి దొండకాయ టమోటా రోటీ పచ్చడి

మీరు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోన్ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఉదయం టిఫిన్స్ లో కూడా అదిరిపోతోంది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని తినండి.