
కావాల్సిన పదార్ధాలు : కేజీ చికెన్, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలక్కాయ , అనాస పువ్వు, జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, 4 టేబుల్ స్పూన్స్ నూనె, బిర్యానీ ఆకులు నాలుగు తీసుకోవాలి.

ముందుగా చికెన్ ను ఒకటికి రెండు సార్లు శుభ్రపరచుకోవాలి. నీచు వాసనగా అనిపిస్తే మళ్లీ ఇంకోసారి కడగండి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని దానిలో గస గసాలు , ధనియాలు, జీలకర్ర వేసి బాగా వేయించాలి.

ఆ తర్వాత వేయించిన మిశ్రమాన్ని తీసుకుని మిక్సీ లో పొడిలాగా పట్టుకోవాలి. ఇక ఇప్పుడు పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, నూనె కాలిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, యాలకులు 4, అనాస పువ్వు, జీడిపప్పులు వేసి కలర్ మారే వరకు బాగా వరకు వేయించాలి.

కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక టేబుల్స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్ గా వేయించాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఉడకనివ్వాలి. స్టవ్ మీదే 10 నిముషాలు ఉంచి అన్ని రకాల మసాలా పొడులు వేసి బాగా కలుపుకోవాలి.

మధ్యలో చికెన్ ఉడికిందో? లేదో చూసి పెరుగు కూడా వేసి రెండు గ్లాస్ ల నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టాలి. చికెన్ ను కలుపుతూ ఉండండి. ఇక చివర్లో దించే ముందు కొత్తిమీర వేసి మీడియం మంట మీదే ఉడికించండి. అంతే, వేడి వేడి టేస్టీ ఉండే చికెన్ కుర్మా రెడీ. చపాతీల్లోకి, పలావ్ రైస్ లో కి ఇది రుచికరంగా ఉంటుంది.