
మటన్, చికెన్ కర్రీలోకి బగారా రైస్ అనేది తప్పకుండా వండుతుంటారు. అంతే కాకుండా ఏ నాన్ వెజ్ వంటకంలోకి అయినా సరే మటన్, చికెన్ లోకి బగారా రైస్ వండి తింటే, ఆ రుచి మర్చిపోలేరు. కాగా, ఇప్పుడు మనం మటన్ ముక్కనే కాకుండా అన్నంతో తింటే అద్బుతంగా ఉండాలి అంటే తప్పకుండా బగారా రైస్ ఇలా వండాలంట. కాగా దాని గురించే తెలుసుకుందాం.

బగారా రైస్ కోసం కావాల్సిన పదార్థాలు : బాస్మతి లేదా సోనా మైసూరి రైస్ రెండు కప్పులు తీసుకోవాలి. నీళ్లు నాలుగు కప్పులు, నెయ్యి ఒక కప్పు, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు, పచ్చి మిర్చీ , ఆనియన్ తరిగినవి, ఉప్పు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, బిర్యానీ మసాలాలు.

తయారీ విధానంలోకి వెళితే..బగారా రైస్ వండటానికి ముందు వీటిని దాదాపు ఇరవై నిమిషాల పాటు, నానబెట్టాలి. తర్వాత గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత అందులో లవంగాలు, యాలకులు,షాజీరా, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి, ఆనియన్స్, ఉల్లిపాయలు తరిగినవి అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి.

తర్వాత అందులో నాలుగు కప్పుల నీళ్లు వేసి మూత పెట్టి సిమ్‌లో 15 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత నీళ్లు వేసి బాగా నీళ్లు వేసి మరగబెట్టాలి. నీళ్లు బాగా మరగాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో బియ్యంగింజలు వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. అన్నం ఎంత మంచిగా ఉడికితే అంత బాగుంటుంది.

తర్వాత అందులో మీకు నచ్చిన ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చును. ఇది మంచి రుచికరంగా మారుతుంది. ఈ రైస్ మటన్, చికెన్‌లోకి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా రుచి కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. బగారా రైస్ ఇలా వండితే ఏ మటన్ అయినా చికెన్ అయినా సరే, ప్రతి ముద్దకు, ముక్కతో అద్భుతంగా ఉంటుంది.