
కావాల్సిన పదార్దాలు: కంది పప్పు, టమాటాలు, పచ్చిమిర్చి, బీన్స్, బంగాళాదుంప, కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, కారం, నూనెను తీసుకోవాలి.

పప్పు ఉడికించడం: ముందుగా కంది పప్పును తీసుకుని దానిని రెండు సార్లు కడిగి, 4 కప్పుల నీరు, అర టీ స్పూన్ పసుపు,దానిలో నూనెను వేసి ప్రెజర్ కుక్కర్‌లో బాగా ఉడికించాలి.

కూరగాయలను ఉడికించడం: మధ్యలో పప్పు ఉడికిన తర్వాత కూరగాయలు అన్ని వేసి, దానిలో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు వేసి కూరగాయలు మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి వాటిని బాగా ఉడికించాలి.

ఇప్పుడు టమోటా ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ కార వేసి స్టవ్ మీదే ఉంచి దీనిని బాగా ఉడికించాలి. దీనిలో ఒక గ్లాస్ నీళ్లు పోసి, రుచి పప్పును 10 నిమిషాల పాటు మీడియం మంట మీద పొయ్యి మీదే ఉడికించాలి.

ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దానిలో 3 టేబుల్ నూనె ఆయిల్ చేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, జీలకర్ర, 4 కరివేపాకు ఆకులు పోపు వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పోపు పెట్టుకోవాలి. అంతే, వేడి వేడి పచ్చి కూరగాయల పప్పు రెడీ.