వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం తగ్గుతుంది.. ఇవి తెలుసుకోండి..

Updated on: May 19, 2026 | 8:59 PM

Washing Machine: ఈ వేగవంతమైన ప్రపంచంలో మహిళల శ్రమను తగ్గించే హోమ్ అప్లయన్సెస్‌లో వాషింగ్ మెషీన్ అత్యంత కీలకమైనదిగా మారిపోయింది. అయితే దీని వాడకం పెరిగే కొద్దీ నెల నెలా వచ్చే కరెంట్ బిల్లులు కూడా సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బ్రాండ్ల వాషింగ్ మెషీన్లలో ఎకో వాష్ అనే ప్రత్యేకమైన ఆప్షన్‌ను అందిస్తున్నాయి. అసలు ఈ ఎకో వాష్ అంటే ఏమిటి? ఇది విద్యుత్ బిల్లులను ఎలా తగ్గిస్తుంది? దీని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

1 / 5
అసలు ఎకో వాష్ అంటే ఏంటీ?: ఎకో వాష్ అనేది ఎకలాజికల్ వాష్ లేదా ఎకనామికల్ వాష్ అనే పదాల సంక్షిప్త రూపం. సులభంగా చెప్పాలంటే.. ఇది తక్కువ విద్యుత్, తక్కువ నీటిని ఉపయోగించి బట్టలను ఉతికే ఒక అధునాతన, పర్యావరణ అనుకూల సాంకేతికత. బట్టలు శుభ్రపడటంతో పాటు పర్యావరణానికి, మన జేబుకు మేలు చేయడం దీని ప్రత్యేకత.

2 / 5
ఈ స్మార్ట్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది: సాధారణంగా వాషింగ్ మెషీన్లు బట్టలు ఉతకడానికి ఉపయోగించే నీటిని వేడి చేయడానికి తమ మొత్తం విద్యుత్‌లో 80శాతం నుండి 90శాతం వరకు వాడుకుంటాయి. కానీ ఎకో వాష్ మోడ్ దీనికి భిన్నంగా పనిచేస్తుంది. ఈ మోడ్‌లో బట్టలను చాలా తక్కువ ఉష్ణోగ్రతలో లేదా సాధారణ చల్లటి నీటిలోనే ఉతుకుతారు. దీనివల్ల నీటిని వేడి చేయడానికి అయ్యే విద్యుత్ పూర్తిగా ఆదా అవుతుంది.

3 / 5
పెరిగే సైకిల్ టైమ్:  చల్లటి నీరు కాబట్టి బట్టలు సరిగ్గా ఉడకవేమో అనే సందేహం రావచ్చు. అందుకే ఈ సెట్టింగ్‌లో బట్టలు నానబెట్టే, స్పిన్నింగ్ చేసే సమయాన్ని కొద్దిగా పెంచుతారు. ఈ అదనపు సమయం వల్ల డిటర్జెంట్ కణాలు చల్లటి నీటిలో కూడా పూర్తిగా కరిగి, బట్టల పొరల్లోకి చొచ్చుకుపోయి మురికిని సమర్థవంతంగా తొలగిస్తాయి.

4 / 5
నీటి హీటింగ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి నెలవారీ కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది. ఈ ఫీచర్ బట్టల బరువును బట్టి అవసరమైన నీటి పరిమాణాన్ని కచ్చితంగా లెక్కించి చాలా తక్కువ నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. అధిక వేడి ఉండదు కాబట్టి బట్టల రంగు వెలిసిపోకుండా ఉంటుంది. దుస్తులు ఎక్కువ కాలం కొత్తవిగా మెరుస్తాయి.
విద్యుత్, నీటి వినియోగం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.

నీటి హీటింగ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి నెలవారీ కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది. ఈ ఫీచర్ బట్టల బరువును బట్టి అవసరమైన నీటి పరిమాణాన్ని కచ్చితంగా లెక్కించి చాలా తక్కువ నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. అధిక వేడి ఉండదు కాబట్టి బట్టల రంగు వెలిసిపోకుండా ఉంటుంది. దుస్తులు ఎక్కువ కాలం కొత్తవిగా మెరుస్తాయి. విద్యుత్, నీటి వినియోగం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.

5 / 5
ఈకో వాష్ ఫీచర్ అన్ని రకాల వస్త్రాలకు అనుకూలమైనప్పటికీ మీ బట్టల మురికిని బట్టి దీనిని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. తేలికపాటి మురికి ఉన్న రోజువారీ బట్టలు, ఆఫీస్ దుస్తులు, జీన్స్, సున్నితమైన వస్త్రాలకు ఇది మోస్ట్ రికమెండెడ్ ఆప్షన్. అయితే బాగా మొండి మరకలు పడిన బట్టలు, ఎక్కువ మురికిగా ఉన్న దుస్తులు లేదా క్రిమిరహితం చేయాల్సిన బెడ్ షీట్లు, టవల్స్ ఉతకడానికి ఈ మోడ్ అంతగా సెట్ అవ్వదు. ఎందుకంటే ఇందులోని చల్లటి నీరు మొండి మరకలను, జిడ్డును పూర్తిగా వదిలించలేదు.

Follow Us