కిచెన్ సింక్ నుంచి భరించలేని దుర్వాసన వస్తోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో ఈజీగా చెక్ పెట్టండి!

Updated on: Oct 18, 2026 | 10:10 PM

కిచెన్ సింక్ నుంచి చెడు వాసన రావడం చాలా ఇళ్లలో ఒక సాధారణ సమస్య. మనం ఎంత శుభ్రం చేసినా కొన్నిసార్లు ఆ వాసన వస్తూనే ఉంటుంది. ఇది వంటగది వాతావరణాన్ని చాలా ఇబ్బందికరంగా మారుస్తుంది. అందుకే సింక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం. అయితే ఈ సింక్‌ క్లీన్ చేసందుకు ఖరీదైన కెమికల్స్‌ కాకుండా ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈజీగా క్లీన్ చేయవచ్చు. అదెలానో ఇక్కడ చూద్దాం.

1 / 5
బేకింగ్ సోడా, వెనిగర్: వీటితో సింక్‌ క్లీన్ చేసేందుకు ముందుగా ఒక కప్పు బేకింగ్ సోడాను తీసుకొని దాన్ని సింక్‌లో వేయండి.  ఆ తర్వాత అర కప్పు వైట్ వెనిగర్ పోసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచండి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. ఈ పద్ధతి సింక్ నుంచి వచ్చే వాసనను, అందులో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.

2 / 5
నిమ్మకాయ, ఉప్పుతో రుద్దడం: సింక్ దుర్వాసనను దూరం చేసేందుకు ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్. ఇందుకోసం ఒక నిమ్మకాయను సగానికి కోసి దానిపై కొద్దిగా ఉప్పు చల్లండి. ఈ నిమ్మకాయ ముక్కతో కిచెన్ సింక్‌ను, దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బాగా రుద్దండి. నిమ్మకాయ, ఉప్పు మిశ్రమం చెడు వాసనను పోగొట్టి, సింక్‌కు మంచి తాజా సువాసనను ఇస్తుంది.

3 / 5
ఐస్, నిమ్మకాయ తొక్కలు: ఈ పద్దతిలో సింక్‌ దుర్వాసనను పొగొట్టేందుకు కిచెన్ సింక్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్, నిమ్మకాయ తొక్కలు వేయండి. ఆ తర్వాత కుళాయిని పూర్తిగా తెరిచి నీళ్లు పోయండి. ఇది పైపుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, వాతావరణాన్ని తాజాగా ఉంచుతుంది. ఐస్ పైపులను చల్లగా ఉంచుతూ వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది.

4 / 5
దాల్చినచెక్క పొడి మాయ:ఈ పద్దతితో సింక్ దుర్వాసనను దూరం చేసేందుకు ముందుగా ఒక దాల్చిన చెక్కను తీసుకొని దాన్ని పొడిగా చేయండి. తర్వాత సింక్ డ్రెయిన్ దగ్గర ఒక దాల్చినచెక్క పొడి చల్లండి. ఇది చాలా సేపటి వరకు మంచి సువాసనను నిలిపి ఉంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల సింక్ నుంచి ఎటువంటి చెడు వాసనా రాదు.

5 / 5
వేడి నీటితో శుభ్రం చేయడం: వారానికి కనీసం ఒక్కసారైనా సింక్ డ్రెయిన్‌లో మరుగుతున్న నీటిని పోయండి. ఇలా చేయడం ద్వారా డ్రెయిన్‌లో అడ్డుపడిన జిడ్డును, వ్యర్థాలను కరిగించి శుభ్రం చేస్తుంది. ఈ పద్ధతి సింక్, డ్రెయిన్ రెండింటినీ శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల సింక్ నుంచి ఎటువంటి దుర్వాసనా రాకుండా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us