
2 కేజీల మటన్ కూర రెసిపీకి కావాల్సిన పదార్దాలు: రెండు కిలో మటన్, 5 ఉల్లిపాయలు, 6 టమాటాలు, 8 పచ్చిమిర్చి, 6 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక కప్పు పెరుగు , అర టేబుల్ స్పూన్ పసుపు, 5 టేబుల్ స్పూన్స్ కారం, 4 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర పొడిని తీసుకోవాలి.

వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్స్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, రెండు కొత్తిమీర కట్టలు, ఒక కట్ట పుదీనా , రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసంను తీసుకోవాలి. ఇంకా తాలింపు కోసం కొద్దిగా నూనె, 4 బిర్యానీ ఆకులు, 3 దాల్చిన చెక్క, 8 లవంగాలు, 6 యాలకులను తీసుకోవాలి.

2 కేజీల మటన్ కూర రెసిపీ తయారీ విధానం: ముందుగా మటన్‌ను కడిగి దీనిలో కొద్దిగా పెరుగు, కొద్దిగా పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో 30 నిమిషాల పాటు దీనిని మెరినేట్ చేయాలి. ఇంకా ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేసి అది బాగా వేడయ్యాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, రెండు లవంగాలు, యాలకులు వేయాలి.

2 కేజీల మటన్ కూర రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : నాలుగు ఉల్లిపాయలు దీనిలో వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు దీనిని బాగా వేయించండి. ఇంకా నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇంకా దీనిలో టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు దీనిని బాగా వేయించాలి.

2 కేజీల మటన్ కూర రెసిపీ తయారీ విధానం స్టెప్ 2 : ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మెరినేట్ చేసిన మటన్ దీనిలో వేసుకోవాలి. ఇంకా ఈ మసాలాలు కూరకు బాగా పట్టించాలి ఇది ఉడికిన తరువాత మూత తీసి గ్రేవీ వచ్చే వరకు ఉంచితే సరిపోతోంది