
ఇళ్లలో ప్రతి ఒక్కరూ స్టీల్ బకెట్లు, స్టీల్ పాత్రలను ఉపయోగిస్తారు. కొందరు ఆహార పదార్థాలు నిల్వ చేస్తే, మరికొందరు ధాన్యం లేదా నీటిని స్టోర్ చేయడానికి వీటిని వాడుతుంటారు. అయితే ఎక్కువ రోజులు వాడటం, నీటిలోని మలినాలు, ఇతర కారణాల వల్ల క్రమంగా అవి మురికిగా లేదా తెల్లగా మారిపోతుంటాయి. అలాంటి వాటిని సాధారణ డిష్‌వాషర్‌తో క్లీన్ చేస్తే ఆ మరకలు అస్సలు పోవు. కానీ మీ ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే ఇలా పాతబడిన స్టీల్ పాత్రలను నిమిషాల వ్యవధిలోనే కొత్తవాటిలా మెరిపించవచ్చు.

@CleaningwithManvi అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం.. పాత, మురికిగా మారిన స్టీల్ బకెట్‌ను శుభ్రం చేయడానికి ముందుగా ఒక పెద్ద టబ్‌ను నీటితో నింపాలి. తర్వాత మీరు శుభ్రం చేయాలనుకున్న బకెట్‌ను ఆ నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిలో 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి ఓ గంట పాటు అలాగే వదిలేయాలి. మీకు సమయం ఉంటే రాత్రంతా కూడా నానబెట్టవచ్చు.

ఆ తర్వాత బకెట్‌ను బయటకు తీసి, దానిపై కొద్దిగా డిష్‌వాషర్ లిక్విడ్ వేయండి. దాన్ని బకెట్ మొత్తానికి రుద్ది కాసేపు అలాగే వదిలేయండి. తర్వాత ఒక ఈనో (Eno) ప్యాకెట్ తీసుకొని, దానిని బకెట్ మొత్తంపై కొద్దికొద్దిగా చల్లండి. ఈనో, క్లీనర్‌లో ఉండే రసాయనాలు మురికి, పాత మరకల పట్టును సడలించి, శుభ్రపరచడాన్ని చాలా సులభతరం చేస్తాయి.

ఇప్పుడు ఒక స్టీల్ స్క్రబ్బర్ లేదా గుడ్డతో బకెట్‌ను మెల్లగా రుద్దండి. ఇప్పటికే బకెట్‌ను నీటిలో నానబెట్టడం, దానిపై లిక్విడ్ వేయడం వల్ల దానికి ఉన్న మురికి మొత్తం వదులుగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు దాన్ని మెల్లగా రుద్దినా కూడా దానిపై ఉన్న మురికి మొత్తం సులభంగా తొలగిపోతుంది. ఇక రుద్దిన తర్వాత ఆ బకెట్‌ను పూర్తిగా శుభ్రమైన నీటితో కడగండి.

ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని బకెట్‌లో ఎలాంటి తడి లేకుండా శుభ్రంగా తుడిచి కాసేపు గాలికి ఆరనివ్వండి. అంతే.. మురికిగా ఉన్న మీ స్టీల్ బకెట్ కొద్ది నిమిషాల్లోనే కొత్తదానిలా తళతళా మెరిసిపోతుంది. అయితే మీరు స్టీల్ స్క్రబ్బర్‌ను వాడుతున్నారు కాబట్టి గట్టిగా రుద్దితే బకెట్‌పై గీతలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మెల్లగా మాత్రమే రుద్దండి. Note: పైన ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 ధృవీకరించడం లేదు.